Homeసినిమాఆదిపురుష్.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండేది..

ఆదిపురుష్.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండేది..

కానీ ఒక్క టీజర్ తో పెద్ద విమర్శలు రావడంతో డైరెక్టర్ ఓం రౌత్ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేశాడు. దీంతో ఇప్పుడైనా అనౌన్స్ చేసిన తెదీకి సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కి డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సింగిల్ పోస్టర్ తో డార్లింగ్ ఫ్యాన్స్ డౌట్స్ కి క్లారిటీ ఇచ్చేశాడు కెప్టెన్ ఓం రౌత్.

హాయిగా మాస్ సినిమాలు చేసే ప్రభాస్…మొదటిసారి మైథలాజికల్ సినిమా వైపు అడుగులు వేశాడు. డైరెక్టర్ ఓం రౌత్ చెప్పిన లైన్ నచ్చి..ఆదిపురుష్ సినిమాను ఫినీష్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ఇక్కడ ప్రభాస్ ఒకటి అనుకుంటే… మరోకటి అయింది. రిలీజ్ కు ముందే మేకర్స్ కి చుక్కలు లెక్కపెట్టిస్తుంది. ఒక్క టీజర్ తో సినిమా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఏ సినిమాకు అయితే టీజర్ రిలీజ్ అయితే…హైప్ పెరుగుతుంది.

కానీ ఆదిపురుష్ సినిమాకు మాత్రం నెగిటివి పెరిగింది. సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన కొన్ని గంటల్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అసలు గ్రాఫిక్స్ ఏమిటి అని ఆడియన్స్ అయితే దారుణంగా కామెంట్ చేశారు. చిన్నపిల్లల కార్టూన్స్ కు సంబంధించిన గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అని, అసలు దర్శకుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా సినిమాను డిజైన్ చేశాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీన్ కట్ చేస్తే… సినిమాను వాయిదా వేశారు మేకర్స్.

గ్రాఫిక్స్ సన్నివేశాల కోసం రీ వర్క్ చేయాలని మరో 100 కోట్లు ఖర్చుపెట్టడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు కొనసాగుతున్నాయి.

రీ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సగానికి పైగా గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయి. ఇక సినిమాలో అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 2023 జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పుడు కూడా అనుమానమే అని వాయిదా పడే అవకాశం ఉంది అని మరొక టాక్ వినిపించగా దర్శకుడు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఆదిపురుష్ సినిమా 150 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని చెప్పాడు.

Must Read

spot_img