Homeసినిమావరుస సినిమాలతో దూసుకుపోతోన్న వర్సటైల్ యాక్టర్..

వరుస సినిమాలతో దూసుకుపోతోన్న వర్సటైల్ యాక్టర్..

ధనుష్ నయా మూవీ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే డౌట్స్ కి క్లారిటీ ఇచ్చేశాడు ధనుష్. .

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్.

ఇదిలా ఉంటే ఇప్పుడు ధనుష్ తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. కథ ఒక స్లమ్ ఏరియాలో జరగనుందనే హింట్ ఇస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని సన్ పిక్చర్స్ వారు తెలియజేశారు. ఈ కథ నార్త్ చెన్నైకి సంబంధించిన ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ను సన్ పిచర్స్ నిర్మించనుంది.

ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.ఈ సినిమాలో ధనుష్ చెల్లెలి పాత్రను దుషార విజయన్ పోషించనుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అప్డేట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సార్ సినిమా చేస్తున్నాడు ధనుష్. మేకర్స్ ఈ చిత్రం నుంచి బంజారా పాటను లాంఛ్ చేశారు. ధనుష్‌ నటిస్తోన్న స్ట్రెయిట్‌ తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

Must Read

spot_img