Homeసినిమాటాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల పరంపర..

టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల పరంపర..

బాహుబలి తరువాత టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల పరంపర మొదలైంది. ప్రభాస్ నుంచి యంగ్ హీరో నిఖిల్ వరకు ఇప్పడు ప్రతీ హీరో పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా లీగులో దూసుకుపోతుంటే ఆ తరువాత రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ,నిఖిల్ లాంటి హీరోలు పోటీపడుతున్నారు. కొత్తగా ఈ రేసులోకి నేచురల్ స్టార్ నాని .అఖిల్ అక్కినేని వచ్చి చేరబోతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్ RC15 బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ఎన్టీఆర్ త్వరలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ ప్రాజెక్ట్ ని ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నాడు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న ఈ మూవీ మార్చిలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక వీరితో పాటు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’తో పాన్ ఇండియా వైడ్ గా హంగామా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇక యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా పాన్ ఇండియా జపం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో నటించిన అఖిల్ పూర్తి స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా మూవీలో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో స్పై థ్రిల్లర్ గా ‘ఏజెంట్’ మూవీని చేస్తున్నాడు.

ఇక యంగ్ హీరో నిఖిల్ కూడా ‘కార్తికేయ 2’ తరువాత మరోసారి పాన్ ఇండియా మూవీ ‘స్పై’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా హల్ చల్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Must Read

spot_img