Homeఅంతర్జాతీయంటర్కీ, సిరియాలలో వరుస భూకంపాలు..

టర్కీ, సిరియాలలో వరుస భూకంపాలు..

టర్కీ, సిరియాలలో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి.. ఈ పరిణామాల నేపథ్యంలో 2023లో ఏర్పడనున్న ప్రకృతి బీభత్సాల గురించి నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.

  • 2023లో ఐదు భయానక అంశాలు జరుగనున్నాయని జ్యోతిష్యం చెప్పారు బాబా వంగ..
  • టర్కీ, సిరియాలలో వరుస భూకంపాలు సంభవించడంతో వంగా చెప్పిన భవిష్యవాణి మరోసారి ప్రజల్లో చర్చనాయాంశంగా మారింది..
  • ఇంతకూ వంగా ఈ ఏడాది జరిగే పరిణామాలపై తన భవిష్యవాణిలో ఏం చెప్పింది..?

టర్కీ, సిరియా దేశాలు వరుస భూకంపాలతో వణికిపోతున్నాయి. ఎటుచూసినా హృదయ విదారక ఘటనలే దర్శనమిస్తున్నాయి. సుమారు 4 వేలమందికి పైగా మరణించినట్లు అధికారికంగా ప్రకటించినా.. శిధిలాల కింద భారీగా ప్రజలు చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య భారీగా ఉండనుందని అధికారులు చెబుతున్నారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.. ఈ నేపథ్యంలో 2023లో ఏర్పడనున్న ప్రకృతి బీభత్సాల గురించి నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.

2023 ప్రపంచానికి డెడ్ లైన్ అని బాబా వంగా భవిష్యవాణి చెప్తోంది. ఇప్పటికే 90 శాతం బాబా వంగా జ్యోతిష్యం నిజమైంది. అలాగే బాబా వంగా చెప్పిందే నిజం అవుతుందని ఆమె శిష్యులు అంటున్నారు. బాబా వంగాను దైవదూతగా బల్గేరియా ప్రజలు భావిస్తున్నారు…. ఈ ఏడాదిలో చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని బాబా వంగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జీవ ఆయుధాల శకం నెలకొంటుందని బాబా వంగా అన్నారు. వచ్చే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని ఆమె చెప్పారు. బాబా వంగా చెప్పినట్లే ఆస్ట్రేలియాలో గతేడాది భారీ వరదలు ఏర్పడ్డాయి.

2వాయిస్: 1996లో మరణించిన బాబా వంగా.. గత కొంతకాలం నుంచి బాబా వంగ చెప్పే భవిష్య వాణి నిజమౌతూ వస్తోంది. అమెరికాలో ఉగ్రవాద దాడులు జరుగుతాయని డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వడం వంటివి ఇప్పటికే నిజమయ్యాయి. 2023లో ఐదు భయానక అంశాలు జరుగనున్నాయని జ్యోతిష్యం చెప్పారు. సహజ జననాల ముగింపు వుంటుందని సౌర సునామీ తప్పదని ఆమె చెప్పారు.

బాబా వంగాను అధికారికంగా వంగేలియా పాండేవా గుష్టెరోవా అని పిలుస్తారు. బల్గేరియాకు చెందిన ఒక ఆధ్యాత్మికవేత్త. మూలికా శాస్త్రవేత్త ఈమె. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియన్ కోజుహ్ హైలాండ్స్‌లోని రూపైట్ ప్రాంతంలో నివసించింది. 2023లో వరుస భూకంపాలు సంభవిస్తుండటంతో.. ఆమె చెప్పిన జ్యోతిష్యం ప్రపంచ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

3వాయిస్: 2023 ఏడాదికి సంబందించిన మానవ జీవితం, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను బాబా వంగా వెల్లడించారు. 2023లో కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని, మనుషుల జీవితం నాశనం అవుతుందని ఆమె అంచనా వేశారు. భూమి కక్ష్యలో మార్పు ఉంటుందని దీంతో భూమిపై అనేక మార్పులకు జరుగుతాయని ఊహించారు..

సౌర తుఫానుతో సహా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడనున్నాయని… ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ , వాతావరణ మార్పులతో మానవ జీవితం అల్లకల్లోలంగా మారనుందని పేర్కొన్నారు.. ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటి ప్రజలపై జీవ ఆయుధాలతో దాడి చేయడానికి పరిశోధనలు చేస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ఈ జీవాయుధాల దాడితో కోట్ల మంది చనిపోతారనిపేర్కొన్నారు.

  • 2023లో భూమి తన కక్షను మారుతుందని అంచనా వేసింది…

స్పేస్ డాట్ కామ్ ప్రకారం భూమి సూర్యుడికి 58.4 కోట్ల మైళ్ళ దూరంలో తిరుగుతూ ఉంది. అయితే ఈ భూమి తిరిగే కక్షమార్గం గుండ్రంగా లేదు కోడుగుడ్డు ఆకారంలో ఉన్నది . ఈ తరుణంలో గ్రహాల ఆకర్షణ వల్ల భూమి కక్షమార్గం మారే అవకాశం ఉండవచ్చని దీనివల్ల వాతావరణ మార్పులు ఏర్పడి అతివేడి,అతి చలి ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అంతేకాదు 2023లో జీవ రసాయన ఆయుధాలపై పరీక్షలు జరిగే అవకాశం ఉందని వంగ బాబా అంచనా వేసింది. నిజానికి ఈ అంచనా చాలా భయంకరమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే భయానకమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు.అణు విద్యుత్ ప్లాంట్‌ లో త్వరలో పేలుడు జరుగుతుందని బాబా వంగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇక్కడ.. ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా ఆక్రమించుకోవడంతో ఈ అంచనా కూడా నిజం అవుతుందేమో అనే ఆలోచన చాలామందిలో కలుగుతుంది.

2023లో.. ప్రపంచ పాలకులు ఎలాంటి వ్యక్తులు జన్మించాలో కూడా నిర్ణయిస్తారు. మనిషి లక్షణాలను, రూపాన్ని కూడా నిర్ణయిస్తారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుముఖం పడుతుంది. దీంతో ప్రభుత్వ పాలకులు జనన ఎంపికకు అనుకూలంగా చర్యలు తీసుకుంటారు. బాబా వంగా 2023 లో రానున్న విపత్తుల గురించి వేసిన అంచనాలు 68శాతం నిజమయ్యే అవకాశం ఉందని బ్రిటీష్ వార్తాపత్రిక, ‘ది మిర్రర్’ నిర్దారించింది.కేవలం 2023 గురించి మాత్రమే కాదు.. రానున్న 5 సంవత్సరాల్లో ఏర్పడనున్న పరిస్థితులను బాబా వంగా అంచనా వేశారు.

ముఖ్యమైన అంచనాలు ఏమిటంటే.. 2025లో యూరప్ దాదాపు కనుమరుగవుతుందని పేర్కొన్నది. భూమిపై ఇంతకు ముందెన్నడూ చూడని భారీ సౌర తుఫాను రాబోతోందని వంగా జోస్యం చెప్పారు. బాబా వంగా ప్రస్తావించిన సౌర తుఫానులు మాస్ బ్లాక్‌అవుట్‌లు, కమ్యూనికేషన్ బ్రేక్‌డౌన్‌లకు కారణం కావచ్చు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. వంగా జ్యోతిష్యంతో ప్రస్తుతం ప్రజల్లో ఆందోళనలను మొదలయ్యాయి.

అంతేకాదు 2028లో కొత్త శక్తి వనరులను కనుగొనాలనే ఆశతో మనిషి శుక్రుడి వైపు ప్రయాణిస్తాడు. తాము దైవంగా కొలిచే బాబా వెంగా చెప్పిన భవిష్యత్ వాణి తప్పకుండ జరుగుతుందని ఆమె శిష్యులు ఢంకా భజాయించి చెబుతున్నారు. బాబా వెంగా 1996 లోనే చనిపోయారు. కంటి చూపు లేని ఆమె రానున్న భవిష్యత్‌ లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు. బాబా వెంగా భవిష్యవాణి ఇప్పటికి పుస్తకరూపంలో ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలు కరోనా మహమ్మారితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక జీవ రసాయన ఆయుధాల్ని తయారు చేస్తే మాత్రం ప్రపంచం మొత్తానికి ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. అయితే వంగ బాబా 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఓ తుఫాను వల్ల కంటి చూపు పోయింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆకాశం వైపు చూస్తూ భవిష్యత్తును అంచనా వేయగలిగింది. ఆమె ఐసిస్ ఉగ్రవాదులు వస్తారని చెప్పింది అది చెప్పినట్లే జరిగింది. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఆఫ్రో అమెరికన్ అవుతారని చెప్పింది. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యారు. ఈ విధంగా వంగ బాబా 2023 లో జరిగే విపత్తుల గురించి వివరించింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ… ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.

2023లో వరుస భూకంపాలు సంభవిస్తుండటంతో.. బాబా వంగ చెప్పిన జ్యోతిష్యం ప్రపంచ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2023లో జీవ రసాయన ఆయుధాలపై పరీక్షలు జరిగే అవకాశం ఉందని వంగ బాబా అంచనా వేసింది. మరి.. చూడాలి బాబా వంగా జోస్యం ఏ మేరకు నిజమవుతుందో..

Must Read

spot_img