- ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి..
- ఆలయాల గోడలపై భారదేశ వ్యతిరేక నినాదాలు రాసిన వార్తలు హిందులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి..
- ఇంతకూ ఈ విధంగా ద్వేషపూరితంగా ఎందుకు దాడులు చేస్తున్నారు..?
- ఆస్ట్రేలియా కూడా భిన్న సంస్కృతులు కలిగిన దేశం.. అలాంటి దేశంలో హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తున్నది ఎవరు..?
- ఆలయాల గోడలపై ద్వేషపూరిత వ్యాఖ్యలను రాసే వారిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుందా..?
- ఈ దాడులపై భారత విదేశాంగ శాఖ ఏం చెబుతోంది..?
ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సోమవారం మరో దేవాలయంపై దాడి జరిగింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో ఉన్న ఆలయం గోడలపై భారతదేశ వ్యతిరేక నినాదాలు రాసినట్లు స్థానిక మీడియా చెబుతోంది.
గత పదిహేను రోజుల్లో ఇది మూడో సంఘటన. అంతకుముందు జనవరి 12, జనవరి 16 తేదీలలో హిందూ దేవాలయాలపై ద్వేషపూరిత నినాదాలు రాసిన వార్తలు వచ్చాయి. దాడుల వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓఫారెల్ వెల్లడించారు..
భారత్ లాగే ఆస్ట్రేలియా కూడా భిన్న సంస్కృతులు కలిగిన దేశం. మెల్‌బోర్న్‌లో రెండు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు దిగ్భ్రాంతిని కలిగించాయి. వీటిపై ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛను మేం గట్టిగా సమర్థిస్తాం. కానీ, ఇందులో ద్వేషపూరిత ప్రసంగాలు, హింసకు చోటు లేదు” అని ఓ ఫారెల్ ట్వీట్ చేశారు. భారత విదేశాంగ శాఖ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.. ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ఘటనకు బాధ్యులు అని ఆస్ట్రేలియాలోని స్థానిక వార్తాపత్రికలలో కథనాలు వచ్చినట్టు పీటీఐ తెలిపింది.
విక్టోరియా ప్రాంతంలో “ఆలయం బాగోగులు చూస్తున్నవారు సోమవారం ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసి ఉండడం చూశారు” అని ది ఆస్ట్రేలియన్ టుడే తెలిపింది. ఆ రాతలు చూసి ఆలయంతో సంబంధం ఉన్న వారందరూ చాలా బాధపడ్డారని, కోపంగా ఉన్నారని ఇస్కాన్ టెంపుల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ భక్త దాస్ తెలిపారు.. ఈ ఘటనపై విక్టోరియా ప్రావిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆలయం సీసీటీవీ ఫుటేజీ కూడా వారికి అందించారని తెలిపారు..
- హిందుస్థాన్ ముర్దాబాద్’’, ‘‘ఖలిస్థాన్ జిందాబాద్’’ వంటి భారతదేశ వ్యతిరేక నినాదాలతో మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ పార్క్‌లో ఉన్న ఆలయ గోడలపై లిఖించారు..
ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు 20,000 మందికి పైగా హిందువులు, సిక్కులను చంపడానికి కారణమైన ఉగ్రవాది భింద్రావాలాపై ప్రశంసలు కురిపించారు. ఆయనను ‘అమరవీరుడు’గా అభివర్ణించారు. గతంలో జరిగిన సంఘటనల్లోనూ ఇదే తరహా నినాదాలు ఆలయ గోడలపై రాశారు.. కాగా.. అంతకు ముందు కారమ్ డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణు దేవాలయం, మిల్ పార్క్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ మందిరం గోడలపై కూడా హిందువులు, భారతదేశానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత సందేశాలు అస్పష్టంగా రాశారు.
హిందూ దేవాలయాలపై వరుస దాడులు అక్కడి హిందువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి…జనవరి 11న ఆస్ట్రేలియాలోని మిల్ పార్క్‌లోని బీఏపీఎస్ సంస్థా మందిర్‌పై భారతదేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక నినాదాలు రాశారు. గోడలపై “హిందూస్థాన్ ముర్దాబాద్”, “మోడీ హిట్లర్” అంటూ పేర్కొన్నారు. కారమ్ డౌన్స్‌లోని రెండో హిందూ దేవాలయం, శ్రీ శివ విష్ణు మందిరం జనవరి 15-16 మధ్య రాత్రి సమయంలో మధ్య దాడి జరిగింది. ఈ ఘటన 17వ తేదీన వెలుగులోకి వచ్చింది. 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆలయాలపై దాడుల గురించి.. అక్కడి ప్రముఖులు సైతం విచారణ వ్యక్తం చేస్తున్నారు.. ఆలయాలపై ఈ రకమైన దాడులు తీవ్రంగా బాధపెట్టాయని అభిప్రాయపడుతున్నారు.. ఆలయాలపై దాడులు మొదలై రెండు వారాలు పైనే అయింది. ఇప్పటి వరకు విక్టోరియా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. శాంతిని ప్రేమించే హిందూ సమాజానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ఎజెండాను నడుపుతున్నది ఎవరో తెలియలేదు.. జనవరి 16న విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్‌లో ఉన్న చారిత్రాక శివ విష్ణు ఆలయంపై దాడి జరిగింది.
ఆ రోజు అక్కడ నివసిస్తున్న తమిళులు పొంగల్ పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్లినప్పుడు గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసి ఉండడం చూశారు. చాలా కాలంగా అక్కడ నివసించే తమిళ మైనార్టీ వర్గీయులు సైతం మతపరమైన హింస నుంచి తప్పించుకోవడానికి శరణార్థులుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు..
- ఆస్ట్రేలియాలో కొద్దిరోజులుగా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరగడం విచారకరమైన విషయం..
ఖలిస్తాన్ మద్దతుదారులు ఇంత నిర్భయంగా ఆలయాల గోడలపై ద్వేషపూరిత నినాదాలు రాయడాన్ని అంగీకరించలేకపోతున్నారు.. ఈ ఖలిస్తానీ మద్దతుదారులకు అంత ధైర్యం ఉంటే విక్టోరియాలో శాంతిని ప్రేమించే హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే బదులు, నేరుగా విక్టోరియా పార్లమెంటుకు వెళ్లి ఈ నినాదాలు రాయాల్సిందన్నారు మెల్‌బోర్న్ హిందూ సంఘం సభ్యుడు సచిన్.. అంతకుముందు జనవరి 12న మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ ఆలయంలో భారత వ్యతిరేక నినాదాలు రాశారు. రాశారు.
దీనిపై ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఆలయ ప్రాంగణంలో భారత వ్యతిరేక నినాదాలు రాయడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు..ఈ విషయంపై భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడుతోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం మీడియా సమావేశంలో తెలిపింది.
“ఇటీవల ఆస్ట్రేలియాలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆస్ట్రేలియా నాయకులు, కమ్యూనిటీ నాయకులు, మత సంస్థలు కూడా దీన్ని బహిరంగంగా ఖండించారు.
మెల్‌బోర్న్‌లోని తమ కాన్సులేట్ జనరల్ ఈ విషయమై స్థానిక పోలీసులతో మాట్లాడారని… నేరస్థులపై సత్వర విచారణ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది.. ఆలయాలపై దాడుల విషయం గురించి.. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడామని” విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుంటామని విక్టోరియా ప్రభుత్వ యంత్రాంగం కూడా హామీ ఇచ్చింది.
విక్టోరియాలో నివసించే ప్రజలందరికీ జాత్యహంకారం, ద్వేషం, విమర్శలకు తావు లేకుండా, తమ విశ్వాసాలను అనుసరిస్తూ శాంతియుతంగా జీవించే హక్కు ఉందని అన్నారు విక్టోరియా యాక్టింగ్ ప్రీమియర్ జసింతా అలెన్..
ఇస్కాన్ ఆలయంపై సోమవారం దాడి జరగడానికి కేవలం రెండు రోజుల ముందు, విక్టోరియాలోని బహుళ – సాంస్కృతిక కమీషన్ వివిధ మతాల నాయకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
ఆ తరువాత, ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ సమాజంపై ద్వేషం వెదజల్లడాన్ని ఖండిస్తూ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఇది చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటి ఘటనలు జరగడానికి మనం అనుమతించకూడదని విక్టోరియా లిబరల్ పార్టీ ఎంపీ బ్రాడ్ బాటిన్ అన్నారు…” ఆస్ట్రేలియా ఎంపీ జోష్ బర్న్స్ ఈ ఘటనలను ఖండిస్తూ, “ఆల్బర్ట్ పార్క్‌లోని హరే కృష్ణ ఆలయంపై దాడి వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు.
ఆస్ట్రేలియాలో కొద్దిరోజులుగా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరగడం విచారకరమైన విషయం.. ఈ తరహా దాడులు జరగకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం.. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.. ఇప్పటికైనా ఆలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరీ..