Homeఅంతర్జాతీయంకెనడాలో తాజాగా ట్రైడెమిక్‌ అనే కొత్త వ్యాధి విస్తరిస్తోంది....

కెనడాలో తాజాగా ట్రైడెమిక్‌ అనే కొత్త వ్యాధి విస్తరిస్తోంది….

ట్రైడెమిక్‌ అని వ్యవహరిస్తున్న ఈ కొత్త జబ్బు విషయానికి వస్తే … మూడు రకాల జబ్బులు ఇందులో కలిసి ఉంటున్నాయి. కెనడాలో ఈ కొత్త రకం జబ్బు కారణంగా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జబ్బును ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి అర్ధం కావడం లేదు. వచ్చిన పేషంట్స్‌కు ఎలాంటి చికిత్స అందించాలో తెలియక ఆస్పత్రి వర్గాలు సతమతమవుతున్నాయి.

మొత్తంగా మూడు రకాల జబ్బులు ట్రైడెమిక్ లో కలిసి ఉన్నాయి. వాటిలో కొవిడ్‌ -19, ఇన్ ఫ్లూయెంజా, రెస్పోరేటరీ సిన్సిటియల్ వైరస్ ..మూడు కలసి ఉంటున్నాయి. ఈ మూడు రకాల జబ్బులని కలిపి ట్రైడెమిక్‌ గా పిలుస్తున్నారు.ఈ మూడు రకాల జబ్బులని కలిపి ట్రైడెమిక్‌ గా పిలుస్తున్నారు. కొత్త రకం వైరస్‌తో కెనడాలో శ్వాసకోస సంబంధమైన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ మధ్యనే ప్రపంచ ఆరోగ్య సంస్థ రానున్న కొద్ది కాలంలో కొత్త రకం జబ్బులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తే వ్యాధులు రెచ్చిపోయే అవకాశం ఉంటుందని తమ నివేదికలో తెలిపింది. కాగా ఈ కేసులు ఇప్పుడు పొరుగునే ఉన్న అమెరికాకు కూడా విస్తరించాయి.

ఈ కొత్త రకం ట్రైడమిక్‌ కేసులు ఎక్కువగా పిల్లల్లో వస్తున్నాయని కెనడాకు చెందిన గ్లోబల్‌ మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉండగా కెనడాకు చెందిన రెస్‌క్రాస్‌ … ఈస్ర్టన్‌ అంటారియో చిల్ర్డన్‌ హాస్పిటిల్‌ రోగులకు చికత్స అందించేందుకు సాయమందిస్తోంది. కాగా రెడ్‌క్రాస్‌ చిన్న చిన్న బృందాలను ఆస్పత్రికి పంపించి.. అక్కడి సిబ్బందికి చేయూతనిస్తోందని రెడ్‌ క్రాస్‌ అధికార ప్రతినిధి తెలిపారు..ఈస్ర్టన్‌ అంటారియో చిల్ర్డన్‌ ఆస్పత్రికి వరదలా వస్తున్న ఇలాంటి కేసులను దృష్టిలో ఉంచుకొని రెండో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను గత నెలలో ప్రారంభించింది. కెనడాలోని ఎడ్‌మౌంటెన్‌ ప్రాంతంలోని చిల్ర్డన్‌ హాస్పిటల్‌లో గత వారం ట్రైడెమిక్‌ కేసులు వంద శాతం దాటిపోయాయి.

దీంతో సాధారణంగా జరిగే సర్జరీలు, అపాయింట్‌మెంట్లను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చిందని గ్లోబల్‌ న్యూస్‌ వెల్లడించింది. కాగా ఈ జబ్బు ట్రైడెమిక్‌ అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం కేవలం ఇందులో మూడు రకాల జబ్బులక్షణాలు కలబోసుకుని ఉండటమే అంటున్నారు. .. ప్లూ, ఆర్‌ఎస్‌వి, కొవిడ్‌ -19 కలిసి ఉన్నందువల్లే దీనికి ట్రైడెమిక్‌అని పేరు పెట్టినట్లు అమెరికాకు చెందిన హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ హెల్త్‌లైనర్‌ పేర్కొంది.

ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఇప్పుడు మూడు రకాలైన వ్యాధులు కట్టగట్టుకుని చెలరేగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చూస్తుండగానే ట్రైడెమిక్ సోకిన బాధిత పిల్లలు వరదలా ఆస్పత్రులకు చేరుతున్నారు. వీరికి అకామడేషన్ కలిగించడంలో ఆస్పత్రి వర్గాలు సతమతమవుతున్నాయి.

కెనడాలోని కాలగరీ నగరం ట్రైడెమిక్ కు కేంద్రంగా మారింది.

ఇక్కడ ప్రస్తుతం ఒక్కసారిగా ఈ వ్యాధి అపారమైన వేగంతో వ్యాపిస్తోందని అలబెర్టా హెల్త్ సర్వీసెస్ ప్రతినిధి తెలిపారు. ఈ చిన్నపిల్లల ఆసుపత్రిలో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి తలెత్తలేదని అంటున్నారు. ఒక్కసారిగా వందశాతం కేసులు పెరిగిపోవడంతో మామూలు కేసులు చూడటం మానివేసారు. నిజానికి ఇటీవలి కాలంలో ఎయిర్​ పొల్యూషన్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది అదనంగా ప్రాణాలు కోల్పోతున్నారని తాజా స్టడీలో వెల్లడైంది. గతంలో పర్టిక్యులేట్​ మేటర్ 2.5 తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటే ప్రమాదకరం కాదన్న స్టడీలకు భిన్నంగా ఇప్పుడు ఇవే ప్రాణాంతకంగా మారాయని గుర్తించారు.

25 ఏండ్ల కాలానికి సంబంధించి 7 లక్షల మంది కెనడియన్ల ఆరోగ్యం, మరణాల డేటాను కలిపి పరిశోధకులు ఈ స్టడీ చేశారు. దేశవ్యాప్తంగా పీఎం 2.5 తీవ్రత గురించిన సమాచారం కూడా సేకరించి విశ్లేషించారు. కెనడాలో పీఎం 2.5 లెవల్స్ చాలా తక్కువ స్థాయిలో నమోదవుతూ ఉంటాయి. అందువల్ల తక్కువ స్థాయి పీఎం 2.5 కారణంగా ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం గురించి స్టడీ చేయడానికి ఈ దేశాన్ని ఎంచుకున్నారు. కెనడాలో గుర్తించిన సమాచారం పీఎం 2.5 స్థాయిలు ప్రాణాంతకంగా ఎలా మారుతుందో వివరించడానికి ఉపయోగపడింది. ప్రపంచ వ్యాప్తంగా గాలి కాలుష్యం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై అవగాహన తెచ్చుకోవడానికి ఈ స్టడీ పనిచేసింది.

Must Read

spot_img