కేవలం తన మనసుకు నచ్చినవాడిని ముద్దుపెట్టుకున్నందుకు ఓ మహిళకు రాళ్లతో కొట్టి చంపే మరణశిక్ష విధించింది సుడాన్ కోర్టు. వ్యభిచారం అభియోగాలతో ఆ మహిళను బోనెక్కించింది. అయితే ఆ చిన్న తప్పుకు అంత పెద్ద శిక్షా అని అంతర్జాతీయంగా విమర్షల వర్షం కురవడంతో కోర్టు దిగి వచ్చింది. శిక్షను అంతర్జాతీయ చట్టం తీవ్ర ుల్లంఘనగా ఆఫ్రికన్ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ స్టడీస్ వర్ణించింది. ఓ రిపోర్ట్..
కేవలం ముద్దుపెట్టుకున్నందుకు ఆ మహిళను రాళ్లతో కొట్టి చంపేయాలని కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను విన్నవారందరూ విస్తుపోయారు. సూడాన్‌కు చెందిన ఒక మహిళ, ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకున్నట్లుగా అంగీకరించడంతో ఆమెకు అంత తీవ్రమైన శిక్ష విధించడం జరిగింది. వ్యభిచారం అభియోగాలతో అరెస్ట్ అయిన ఆమెకు మరణశిక్ష తప్పలేదు. 20 ఏళ్ల ఆ మహిళకు తొలుత చనిపోయేవరకు రాళ్లతో కొట్టడం అనే శిక్షను తీర్పుగా చెప్పారు న్యాయమూర్తి.
దాంతో దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఈ శిక్షను ”అంతర్జాతీయ చట్టం తీవ్ర ఉల్లంఘన”గా ఆఫ్రికన్ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ స్టడీస్ వర్ణించింది. ఆమె ప్రియుడిని, ఆమె బంధువు ఒకరు హత్య చేసిన తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వ్యభిచారం కింద కేసు నమోదు చేశారు. భర్త నుంచి ఆమె విడిపోయారు. వ్యభిచార ఆరోపణలు రుజువు కావడంతో సుడాన్ వైట్ నైల్ రాష్ట్రంలోని కోస్తీ నగర కోర్టు ఆమెకు మరణశిక్షను విధించింది. రాజధాని ఖార్టూమ్‌లో ఈ శిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేసారు.
ఈ తీర్పుపై అంతర్జాతీయంగా ఖండనలు రావడంతో వైట్ నైల్ రాష్ట్ర కోర్టు ఈ కేసును మరోసారి విచారించింది. చివరకు జడ్జి ఆమెపై నమోదైన అభియోగాన్ని ”వ్యభిచారం” నుంచి ”అశ్లీల చర్య’గా మార్చారు. ఈ మేరకు ఆమె ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు, తామిద్దరం ముద్దు పెట్టుకున్నట్లు ఆమె కోర్టు ముందు అంగీకరించారు. ఆమే స్వయంగా అంగీకరించడం కేసును మలుపు తిప్పింది.
దాంతో ఆమెను దోషిగా నిర్దారించడం తప్ప జడ్జి ముందు వేరే అవకాశాలు లేవని ఆమె తరఫు న్యాయవాది అంతిసర్ అబ్దుల్లా అన్నారు. నిజానికి విషయం ఏంటంటే, ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు ఆమె కోర్టు ముందు ఒప్పుకుంది. పైగా ఆమె చాలా చిన్నపిల్ల. ఈ కేసులోని చిక్కుల గురించి ఏమీ తెలియదు.
ఇన్నాళ్లు బెయిల్‌పై బయట ఉన్న ఆమె ఇప్పుడు శిక్ష అనుభవించడం కోసం జైలుకు వెళ్లింది. మొదట ఆమెను న్యాయవాదిని అనుమతించలేదని, విధానపరమైన లోపాలతో రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించారని, ఇప్పుడు ఈ తీర్పును వెనక్కి తీసుకున్నారని ఏసీజేపీఎస్ చెప్పింది. కొన్ని రకాల ‘హుదుద్’ నేరాలకు సూడాన్ ఇంకా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు విధిస్తోంది. ‘హుదుద్’ నేరాలు అంటే ఖురాన్‌లో అల్లా ద్వారా వివరించబడిన నేరాలు.
దొంగతనం, వ్యభిచారం వంటి నేరాలు అక్కడ ఈ కోవలోకే వస్తాయి. సూడాన్ చట్టంలో కొరడాతో కొట్టడం, కాళ్లుచేతుల్ని నరికేయడం, ఉరిశిక్ష, రాళ్లతో కొట్టడం వంటి కఠినమైన క్రూరమైన శిక్షలు అమలులో ఉన్నాయి. సూడాన్‌లో ప్రధానంగా మహిళలకు విధించిన రాళ్లతో కొట్టే శిక్షల్లో ఎక్కువ వాటిని హైకోర్టు రద్దు చేసింది. అయితే ఆమెపై జరిగిన విచారణ “ఒక జోక్” అని ఓ ప్రభుత్వ అధికారి కూడా అంగీకరించారు. “ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించగలిగే మంత్రులెవరూ మాకు లేరని ఆయన అన్నారు. 2021 తిరుగుబాటు తర్వాత సూడాన్‌ను మిలిటరీ జుంటా ప్రభుత్వం పాలిస్తోంది. సూడాన్ మిలిటరీ మరియు సివిలియన్ నాయకుల మధ్య ఓ ఒప్పందం కుదరింది.
ఇన్నాళ్లూ కొనసాగుతున్న మిలిటరీ రూల్ ఇక ముగించాలని సంతకాలు జరిగాయి. 2021 నుంచి సుడాన్ దేశాన్ని అక్కడి మిలిటరీ అధికారులు పాలిస్తున్నారు. దేశంలో పాలన గాడి తప్పడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజా ఒప్పందం మేరకు త్వరలో అక్కడ ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడనుంది.
ఈ ఒప్పందం అక్కడి ‘ఫోర్సెస్ ఫ్రీడం అండ్ చేంజ్, ది ఇస్లామిస్ట్ పాపులర్ కాంగ్రెస్ పార్టీ, డెమాక్రటికి యురియనిస్ట్ పార్టీ, మరికొన్న గ్రూపులు కూడా ఒప్పందంలో భాగమయ్యారు. కుదిరిన డీల్ మేరకు మిలిటరీ పాలకులు గ్యారంటీగా ప్రజాపాలన కిందకు సూడాన్ ను తేవాల్సి ఉంటుంది. ఇప్పటికే అస్తవ్యస్తమైన పాలన కారణంగా ముద్దుపెట్టుకున్నందుకు మరణ శిక్ష విధించడం లాంటి అరాచకాలు జరుగుతున్నాయి.