ఎందుకంటే ప్రభాస్ అంటే ఆ రేంజ్ క్రేజ్ … కానీ ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా .. సారి అని చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న బోలెడు ప్రాజెక్టులలో మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నారు. అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో రొమాన్స్ చేయబోతున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ,రాధే శ్యామ్ బ్యూటీ రిద్ది కుమార్ లను హీరోయిన్లుగా ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్ ను తీసేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి మారుతి ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ ను ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. కానీ ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ పక్కన నిధి అగర్వాల్ అంతగా సెట్ అవ్వలేదని మారుతికి అనిపించిందట. దీంతో హీరోయిన్ ను తప్పించినట్లు తెలుస్తోంది.
అయితే ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిధి అగర్వాల్ ను తీసేస్తే ఈ సినిమాలో ఆమె స్థానంలో మెహరీన్ పిర్జాదాని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “ఆది పురుష్”, “సలార్”, “ప్రాజెక్ట్ కే”, “స్పిరిట్” సినిమా లతో బిజీ గా ఉన్నారు.