అమెరికాలో మొత్తానికి స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కలిగించే బిల్లు చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఆ బిల్లుపై మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టంగా మారింది. ప్రేమ ఎవరిదైనా ప్రేమే అనే ప్రాథమిక నిజాన్ని చాటిచెప్పేందును సంతకం చేసినట్టు పెద్దాయన జో బైడెన్ స్పష్టం చేసారు.
అమెరికాలో స్వలింగ సంపర్కుల ప్రేమకు జో బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. వారు ఇష్టపడి చేసుకునే పెండ్లిళ్లకు చట్టబద్దత ఏర్పడింది. చాలా కాలం తరువాత సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుపై బైడెన్ సంతకం చేసారు. ప్రస్తుతం సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్ చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్ ప్రతినిధుల సభలో ఆమోదం తరువాత ఆ బిల్లుపై మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.
దాంతో బిల్లు చట్టంగా మారింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్.. మీడియాను సంబోందించి మాట్లాడారు ‘ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ అమెరికా సమానత్వం దిశగా మరో అడుగు వేసింది. స్వేచ్ఛ, న్యాయం కొందరికే సొంతం కాదు, అందరికీ అనే దిశగా మరో నిర్ణయం తీసుకుంది.
అది ఏ విధంగానంటే, ఇవాళ నేను సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుపై సంతకం చేశాను’ అంటూ పెద్దాయన ట్వీట్ చేశారు. ‘‘మీలో చాలా మంది సౌత్ లాన్‌లో నిలబడి ఉన్నారు. నేను ఇప్పుడు సంతకం చేసిన చట్టం కోసం జరిగిన పోరాటంలో మీలో ఎందరో మీ బంధాలను వదులుకున్నారు.
మీ ఉద్యోగాలను విడిచిపెట్టారు. మీ జీవితాలను ఫణంగాపెట్టారు’’ అని బిల్లుపై సంతకం సందర్భంగా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించినట్లు ది హిల్ వార్తాపత్రిక తన కథనంలో తెలిపింది. అయితే ముందుగా స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళనతో.. అమెరికన్ సెనేట్ ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.
అధికార డెమోక్రాట్ పార్టీతోపాటు కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దాంతో బిల్లుకు సెనేట్‌లో సులువుగా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు సెనేట్‍లో ఆమోదం పొందినప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతోషం వ్యక్తంచేశారు.
ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్టాన్ని అందరూ గౌరవించాలని, ప్రేమ ఎవరిదైనా ప్రేమే అనే ప్రాథమిక నిజాన్ని చాటిచెప్పే విషయంలో అమెరికా ముందుంటుందనీ, ఇష్టపడే వారిని విహహం చేసుకునే హక్కు అమెరికన్లకు ఉండాలని ఆ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన సంతకం కూడా పూర్తవడంతో సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ కార్యరూపంలోకి వచ్చినట్లయ్యింది. దీంతో అమెరికా వ్యాప్తంగా ఎల్జీబీటీలంతా పండగ చేసుకున్నారు.
ఇక్కడ ఎల్జీబీటీల ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి చూద్దాం.. ఎల్ అంటే లెస్బియన్..లెస్బియన్ అంటే ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ప్రేమ కలగడం. లెస్బియన్లలో ఒకరు పురుషుల్లా ఉంటారని, జుట్టు కత్తిరించుకుని, ప్యాంటుషర్టు వేసుకుంటారని అనుకుంటారు. వాళ్లను బుచ్ అని పిలుస్తారు. ఇక రెండో పార్ట్‌నర్‌లో ఆడలక్షణాలు ఉంటాయని, వాళ్లు మహిళల దుస్తులు ధరిస్తారనీ వాళ్ల హావభావాలు కూడా ఆడవాళ్లలా ఉంటాయని అంటారు.
వాళ్లనే ఫెమ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే లెస్బియన్లలో.. ఎవరి హావభావాల్లో అయినా, ఎలాంటి లక్షణమైనా కూడా ఉండొచ్చు. ఇక జి అంటే గే.. ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగడం జరుగుతుంది. అన్ని వర్గాలవారిని ఇప్పుడు గే అనే పదంతోనే పిలుస్తున్నారు.
బీ అంటే బైసెక్సువల్ బైసెక్సువల్ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగవచ్చు. ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగొచ్చు, లేదా స్త్రీపై ప్రేమ కలగొచ్చు. అలాగే ఒక స్త్రీకి మరో స్త్రీ పై లేదా మగాడిపై ప్రేమ కలగవచ్చు. మిగిలింది టీ.. దీనర్థం ట్రాన్స్‌జెండర్..అంటే మూడో జెండర్‌కి చెందిన వ్యక్తి. పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు. కానీ పెద్దయ్యాక వాళ్లు భిన్నంగా తయారవుతారు.
మగాడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడవచ్చు, ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగాడి లక్షణాలు కనిపించవచ్చు. ట్రాన్స్‌జెండర్ల మనసులో ఉండే ఆలోచనలు వాళ్ల దుస్తుల రూపంలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు వారి వివాహాలు చట్టబద్దం అవడంతో సభ్యసమాజంతో పాటు కలసి జీవించేందుకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.