కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా 96. ఈ చిత్రానికీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి , త్రిష హీరో, హీరోయిన్‌గా నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన కిక్‌తో ప్రేమ్‌కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా అతడు స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్‌ను కొట్టేశాడని కోలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.
తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కార్తి. ఆయన తన మూడో సినిమా నుండే తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తి సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్‌లు వస్తుంటాయి. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్‌లు గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. గతేడాది హ్యట్రిక్ హిట్స్ సాధించిన కార్తి.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘జపాన్’ సినిమా చేస్తున్నాడు. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కార్తి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
96 సినిమాతో తమిళ్‌లో గొప్ప ప్రశంసలు దక్కించుకున్న ప్రేమ్ కుమార్‌తో కార్తి తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ప్రేమ్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో కార్తి వెంటనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా సూర్య సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్‌టైనమెంట్స్‌పై రూపొందనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కథను ప్రేమ్ కుమార్ రూరల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రాసుకున్నాడట. కార్తి ఇందులో మధురైకి చెందిన వాడిగా నటించనున్నాడని టాక్. ఇక ప్రేమ్ కుమార్ ’96’ సినిమాను తెలుగులో శర్వానంద్‌తో ‘జానూ’గా రీమేక్ చేశాడు. కానీ తెలుగులో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.