Homeఅంతర్జాతీయంనడి సముద్రంలో చిక్కుకున్న 57 మంది రోహింగ్యాలు.

నడి సముద్రంలో చిక్కుకున్న 57 మంది రోహింగ్యాలు.

నడి సముద్రంలో నిలిచిన నావలో 57 మంది చిక్కుకుపోయారు..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెల రోజుల పాటు ఇంజన్ చెడిపోయి నిలిచిపోయిన నావలో ఉండిపోయారు. తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక చావు కోసం ఎదురుచూసారు. చనిపోయినవాళ్లను సముద్రంలోనే పడేశారు. చివరకు బలంగా వీచిన గాలులకు కదిలిన నావ ఒడ్డుకు చేరడంతో కోస్ట్ గార్డులు ముందే గుర్తించి వారిని కాపాడారు.

వారికి అది పునర్జన్మగానే భావించాలి. ఎందుకంటే నెల రోజుల పాటు చావుబ్రతుకుల మధ్య మ్రుత్యువుతో దోబూచులాడారు. వారెవరో కాదు..సైన్యాధికారుల దాష్టీకాలను భరించలేక ప్రాణాలు దక్కించుకునేందుకు ఓ పడవను కిరాయకు తీసుకుని పొరుగు దేశాలకు బయలు దేరారు. ఇంతకీ వారెవరో కాదు..మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యాలు. ప్రస్తుతం రోహింగ్యాలు ఎవరికీ చెందనివారు. వారిని గురించి పట్టించుకునేవారే లేరు.

ఇప్పటికే లక్లలాదిగా దేశం వీడిపోగా మిగిలినవారిపై జరుగుతున్న దాడులను భరించలేక వలసలు పోతున్నారు. అలా బయలుదేరిన వారే ఈ బాధితులు. నెలరోజులుగా నడి సముద్రంలోనే గడిపారు. చేసేదేం లేక ఎవరైనా సాయానికి వస్తారేమోనని చూసారు. కానీ దురద్రుష్టవశాత్తు ఎవరూ అటువైపుగా రాలేదు.

ఎందుకంటే అది పెద్ద పెద్ద నౌకలు నడిచే మార్గం కాదు. అందుకే అటువైపుగా ఎవరూ రాలేదు. దాంతో వారు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నెల రోజుల పాటు ఎదురుచూసారు. అలా రోహింగ్యా శరణార్థులు సముద్రంలో చిక్కుకుపోయారు. పొట్ట చేత పట్టుకొని పొరుగు దేశాలకు వలస వెళ్లిన ఈ రొహింగ్యాలు.. సముద్ర మార్గం ద్వారా తమ ప్రయాణాన్ని ఎంపిక చేసుకున్నారు. అది ప్రమాదకరమే అయినా వారికి తప్పలేదు.

అయితే.. మధ్యలోనే ఇంజిన్ పని చేయకపోవడంతో, నడి సముద్రంలో చిక్కుకున్నారు. ఇంజిన్‌ని తిరిగి స్టార్ట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోనీ.. అటుగా ఏవైనా పడవలొచ్చి తమని రక్షిస్తాయనుకుంటే, అదీ లేదు. చుట్టూ సముద్రపు నీరే ఉంది.

తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు. ఇక తమని ఆ దేవుడే కాపాడాలంటూ.. ఆ పడవలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. చివరికి గాలుల పుణ్యమా అని.. ఆ పడవ అటూఇటూ కొట్టుకుపోతూ ఇండోనేషియా తీరానికి చేరుకుంది ఆ నావ. మొత్తం 57 మంది రొహింగ్యాలతో కూడిన ఆ పడవ.. ఇండోనేషియాలోని అషే బేసర్ తీరానికి చేరుకుంది. ఇంజిన్ పాడవ్వడంతో.. నెల రోజుల పాటు తాము అండమాన్‌ సముద్రంలోనే తిండి, నీరు లేక కొట్టుమిట్టాడామని ఆ రోహింగ్యాలు చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ శరణార్థులను ప్రభుత్వ ఆవాసంలో తాత్కాలికంగా స్థావరం కల్పించామని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారు తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం చేయడంతో వారు తీవ్రంగా అలసిపోయారు.

పైగా నెల రోజుల పాటు సముద్రంలో చిక్కుకుపోవడంతో వాళ్లు ఆహారం లేక బలహీనంగా మారారని, డీహైడ్రేషన్‌ బారిన పడ్డారని చెప్పారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే.. ఈ రొహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు.

సోమవారం సాయంత్రం కూడా 186 మంది రొహింగ్యాలతో కూడిన మరొక పడవ కూడా అసెహ్ తీరానికి వచ్చి చేరింది. వారికి కూడా ఎమర్జెన్సీ సేవలు అందించినట్టు ఆ అధికారి వెల్లడించారు. కాగా.. వాస్తవానికి ఈ రొహింగ్యాలందరూ మయన్మార్‌లో నివసిస్తుంటారు. అయితే.. అక్కడ సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రొహింగ్యాలు 2017లో తరలిపోయారు.

అక్కడ కూడా పరిస్థితులు క్షీణించడంతో.. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసబాట పట్టారు. ఈ క్రమంలోనే సముద్ర మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. వారికి మయన్మార్ లో ఏ విలువా ఉండదు. పట్టణాలు నగర శివార్లలో ఎక్కడో జీవిస్తుంటారు. వారు ఎదురుపడితే తీవ్రమైన దాడులు జరుగుతుంటాయి. సైన్యం వారిని ఏమాత్రం సహంచదు. కనిపిస్తే జైలులో వేస్తారు. తీవ్రంగా కొడతారు. సైన్యం బాధ భరించలేక వీలున్న చోటుకు తరలిపోయారు.

అలా విదేశాలకు వెళ్లినా అక్కడ కూడా వారికి ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించరు. 2017లో బంగ్లాదేశ్ కు లక్షల సంఖ్యలో కాలినడకన రోహింగ్యాలు చేరిపోయారు. సాటి ముస్లింలు కదా అని బంగ్లాదేశ్ ప్రభుత్వం వారికి పునరావాస కేంద్రాలలో ఆశ్రయం కల్పించింది.

కానీ అయిదేండ్లలో వారిని ఆర్థికపరంగా భరించడం ప్రభుత్వానికి కష్టంగా మారింది.

Must Read

spot_img