2021-22 సీజన్ కరోనా కల్లోలంతో వినోద పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. 2023 సినిమాలకు ఆశాజనక సంవత్సరంగా కనిపిస్తోంది. ఓ వైపు చైనాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోందంటూ వార్తలు వస్తున్నా .. దేశంలో హై అలెర్ట్ ప్రకటిస్తారన్ననడుమ జనవరిలో వరుస చిత్రాలు ఎలాంటి జంకు లేకుండా విడుదలకు క్యూ కట్టాయి. ఈ జనవరి లో వరుసగా భారీ యాక్షన్ చిత్రాలు పెద్ద తెరపైకి రానున్నాయి. ఏడాది ఆరంభమే ఇది క్విక్ స్టార్ట్ అని చెప్పాలి. ఇటు టాలీవుడ్ లో చిరంజీవి- బాలకృష్ణ నటించిన భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. అటు తమిళంలో దళపతి విజయ్ నటించిన సినిమా విడుదల బరిలో ఉంది.
సంక్రాంతి తెలుగు సినీ పరిశ్రమకు చాలా కీలకమైనది. ఈసారి సంక్రాంతికి పెద్ద స్టార్ల సినిమాలు పోటీ పడనున్నాయి. బాలకృష్ణ వీరసింహా రెడ్డి 12 జనవరి 2023న విడుదల కానుంది. బాలయ్యతోపాటే.. చిరంజీవి- రవితేజ- బాబి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య
ఈ సంక్రాంతి బరిలో జనవరి 13న అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ సినిమాని అటు హిందీలోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.. ముఖ్యంగా బాలకృష్ణ వీరసింహారెడ్డితో వీరయ్య ఢీకొనడం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
విజయ్- రష్మిక మందన్న జంటగా నటించిన వరిసు చిత్రం సంక్రాంతి సందర్భంగా రానుంది. ఈ యాక్షన్ చిత్రం జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. వరిసు తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. అఖిల్ అక్కినేని నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్
జనవరి 2023లో విడుదల కానుంది. ఇందులో అఖిల్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. ఇది చాలా ఆలస్యం అయినా అత్యంత భారీగా పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది. తెలుగు-హిందీ-తమిళం-మలయాళం-కన్నడంలో రిలీజ్ చేయనున్నారు.
షారుఖ్ ఖాన్ పఠాన్
లో కొత్త అవతార్లో పెద్ద తెరపైకి తిరిగి వచ్చాడు. యాక్షన్ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ చాలా హోప్స్ తో ఈ సినిమాని విడుదల చేస్తోంది. జీరో లాంటి డిజాస్టర్ తర్వాత షారూక్ కి కంబ్యాక్ మూవీ ఇది. తళా అజిత్ కుమార్ నటించిన భారీ యాక్షన్ చిత్రం తునివు ట్రైలర్ ఇంతకుముందే విడుదలై ఆకట్టుకుంది. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రమిది. దీనికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. కొత్త సంవత్సరాన్ని అజిత్ సరికొత్త స్టైల్లో ప్రారంభించనున్నాడు. ఈ యాక్షన్ చిత్రం జనవరి చివర్లో విడుదల కానుంది.
