Homeసినిమా2021,2022 పూజాకి అస్సలు కలిసి రాలేదు.

2021,2022 పూజాకి అస్సలు కలిసి రాలేదు.

2021,2022 పూజాకి అస్సలు కలిసి రాలేదు. కరోనా రావడం….సినిమాలు ఫెయిల్ అవడంతో చాలా డిస్టప్ అయింది. దీంతో 2023 పైనే బిగ్ హోప్స్ పెట్టుకున్నారు బుట్టబొమ్మ. అంతేకాదండోయ్… సినిమాలు ఫెయిల్ కావడంతో పారితోషికం విషయంలో కాస్తా వెనక్కి తగ్గింది పూజా హెగ్డే.

2022లో పూజా చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందకు వచ్చాయి. ఏ ఒక్కటి ఆశించిన స్థాయిలో అడలేదు. అచార్య, బీస్ట్ వంటి సినిమా భారీ హైప్ క్రియేట్ చేసిన…ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. అల వైకుంఠపురములో వరకు పూజా హెగ్డేకి తిరుగులేదు అన్నట్లుగా ఆమె హవా సాగింది. ఆమె డస్కీ అందాలకు, పొడుగు కాళ్ళకు యువత వెర్రెత్తి పోతుండడంతో దర్శకనిర్మాతలు ఆమె వెంట పడ్డారు. కానీ ఇండస్ట్రీలో విజయం మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ ఉన్నంతవరకు పూజా హెగ్డే ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఓకె చేయించుకునేవారు.

టాలీవుడ్ పూజా హెగ్డే అత్యధికంగా 3 నుంచి 3.5 కోట్ల వరకు పారితోషికం అందుకునేది. గత ఏడాది ఆమె నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య మూడు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. దీనితో పూజా హెగ్డే క్రేజ్ అమాంతం పడిపోయింది.
ఈ క్రమంలోనే రోజు రోజుకూ ఆమె రెమ్యునరేషన్ కూడా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో SSMB 28 తప్ప మరో తెలుగు మూవీ లేదు.

గతంలో తీసుకుంటున్న రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే…నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. 50 లక్షల నుంచి కోటి వరకు తగ్గించుకోవాలని అడుగుతున్నారట. కొత్త ఆఫర్స్ కావాలంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం పూజా హెగ్డేకి తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు రెడీ అయ్యిందట. మరి ఇకనైనా బుట్టబొమ్మకి కొత్త ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

Must Read

spot_img