మరో నెల రోజులు పోతే సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి. అంతలో తమ సినిమాలని రిలీజ్ చేసేయాలని నిర్మాతలు తెగ పోటీపడుతున్నారు. అందులో భాగంగానే ఈ వారం ఏకంగా 18 సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.అది కూడా ఈ శుక్రవారమే కావడం విశేషం. కాకపోతే అందులో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నవి మాత్రం కొన్ని చిత్రాలే. ఇంతకీ అవేంటి? వాటి రిలీజ్ సంగతేంటి ఇప్పుడు చూద్దాం. ఆ వివరాలు మీకోసం..

డాది చివరికొచ్చేశాం. దీంతో ఇప్పటివరకు రిలీజ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాలన్నీ కూడా థియేటర్లలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి.ముఖ్యంగా ఒకవారం 4 నుంచి 5 సినిమాలు రిలీజ్ అవ్వడం చూశాం. కొన్ని సందర్భాల్లో 7 నుంచి 8 సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రావడం కూడా చూశాం. కానీ ఇది అంతకుమించి.
ఇంకా చెప్పాలంటే, టాలీవుడ్ లో ఇదొక రికార్డ్ అనుకోవచ్చు. అవును.. ఈ వారం ఏకంగా 17 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.. ఏడాది చివర కావడం, జనవరి నుంచి స్లాట్లు లేకపోవడంతో, చిన్న సినిమాలన్నీ డిసెంబర్ లో క్యూ కట్టాయి. ఇందులో భాగంగా ఈ వారాంతం ఏకంగా 17 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఎవరికి ఎన్ని థియేటర్లు దొరికితే అన్ని థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే చాలు అన్నట్టుంది పరిస్థితి. ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో పంచతంత్రం, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం లాంటి సినిమాల గురించి చెప్పుకోవచ్చు. పంచతంత్రం ఆంథాలజీ మూవీ.
సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఇక ముఖచిత్రం సినిమా థ్రిల్లర్ సబ్జెక్ట్. జానర్ పరంగా ఈ 3 సినిమాలకు
తేడాలున్నప్పటికీ, ఈ మూడింటి మధ్య ఓ కామన్ పాయింట్ ఉంది. చాన్నాళ్ల కిందటే రెడీ అయి, ఇలా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి ఈ సినిమాలు.
ఈ సినిమాలతో పాటు ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, రాజయోగం, రామ్ గోపాల్ వర్మ డేంజరస్, విజయానంద్.. ఇలా లెక్కలేనన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. కాస్త డబ్బులు పెట్టగలిగేవాళ్లు ప్రచారం ప్రారంభించారు. లేనివాళ్లు పోస్టర్ల ఖర్చు వరకు పెట్టుకొని, నేరుగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ థియేటర్లలో లవ్ టుడే, మసూద, హిట్2 సినిమాలు నడుస్తున్నాయి.
ఈ లిస్ట్ లోకి గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం లాంటి సినిమాలు చేరతాయా లేదా అనేది ఆసక్తికరం.