ఇటివల ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. రామాయణం, ప్రభాస్ రాముడు అనగానే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత బొమ్మల సినిమా అని, రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ గ్రాఫిక్స్, విజువల్స్ కూడా అస్సలు బాగోలేవు అని విమర్శించారు. వాటిని సరి చేసేందుకు హనుమాన్ సినిమాకి పని చేసిన గ్రాఫిక్స్ టీమ్ ను ఆదిపురుష్ కోసం రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
జాంబిరెడ్డి కాంబో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హీరో తేజ సజ్జ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం హనుమాన్.. గత మూడు వారాల క్రితం ఈ సినిమా టీజర్ ను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయగా.. ఈ టీజర్ సృష్టించిన సెన్సేషన్అద్భుతమని చెప్పాలి. ముఖ్యంగా మైమరిపించే విజువల్స్.. స్ట్రాంగ్ కంటెంట్.. ఆకట్టుకునే బిజీఎం లతో హనుమాన్ టీజర్ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలోని యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ను రాబడుతున్న హనుమాన్ టీజర్ తాజాగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకోవడం గమనార్హం.
అయితే ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. వీరితోపాటు వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం ఇకపోతే వీరు పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ ని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా నుంచి
టీజర్ విడుదల అవ్వగా పూర్తిస్థాయిలో విమర్శల పాలయ్యింది. అదే సమయంలో యంగ్ హీరో తేజ నటిస్తున్న హనుమాన్ సినిమా నుంచి టీజర్ రావడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాకే ఓటేస్తున్నారు.
దీంతో అందరూ ఓం రౌత్ ని విమర్శించడం మొదలుపెట్టారు. 25 కోట్లతో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్స్ ఇస్తుంటే నువ్వేమో 500 కోట్లు అని చెప్పి కార్టూన్ సినిమా చుపిస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవుడ్ని ఎలా చూపించాలో హనుమాన్ టీజర్ చూసి నేర్చుకో అంటూ ఓం రౌత్ ని ట్రోల్ చేశారు. హనుమాన్ టీజర్ ఆదిపురుష్ టీజర్ కంటే 100 రెట్లు బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. అన్ని సోషల్ మీడియాలలో నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు కూడా ఓంరౌత్ ని ఆడేసుకున్నారు. ఈ క్రమంలోని హనుమాన్ టీజర్ ని చూసి ఆది పురుష్ లో కూడా మార్పులు చేస్తున్నారు అని తెలుస్తోంది. ఏదిఏమైనా యంగ్ హీరో తేజ ఈసారి పాన్ ఇండియాతో గట్టిగా పోటీ పడిపోతున్నట్లు టాక్.