Homeజాతీయంషెహ్ బాజ్ షరీఫ్ .. ఎందుకు ఒక్కసారిగా .. శాంతి మంత్రం పఠిస్తున్నారు..?

షెహ్ బాజ్ షరీఫ్ .. ఎందుకు ఒక్కసారిగా .. శాంతి మంత్రం పఠిస్తున్నారు..?

భారత్‍తో మూడు యుద్ధాల తర్వాత తమ దేశం గుణపాఠాలు నేర్చుకుందని పాకిస్థాన్ ప్రధాని షెహ్‍బాజ్ షరీఫ్ అంగీకరించారు. యుద్ధాల వల్ల పాకిస్థాన్‍లో నిరుద్యోగం, పేదరికం, అనేక కష్టాలు పెరిగాయని అన్నారు. అలాగే కశ్మీర్ అంశంపై మరోసారి ద్వంద్వ వైఖరిని ఆయన ప్రదర్శించారు. శాంతి పలుకులు పలికారు. దుబాయ్‍కు చెందిన అరబిక్ న్యూస్ ఛానెల్ ఏఐ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‍బాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‍తో గతంలో జరిగిన యుద్ధాల గురించి, కశ్మీర్ అంశం, భారత్‍తో చర్చలపై మాట్లాడారు.

ఇండియాతో యుద్ధాల తర్వాత పాక్ పరిస్థితి దిగజారిందనేలా షెహ్‍బాజ్ అన్నారు. ఇండియాతో మేం మూడు యుద్ధాలు చేశామని, దీనివల్ల దేశంలో అదనపుకష్టాలు,పేదరికం, నిరుద్యోగం నెలకొంది. మేం గుణపాఠాలు నేర్చుకున్నామని, శాంతితో ఉండాలని అనుకుంటున్నామని అన్నారు. కాకపోతే శాంతి కోసం నిజమైన సమస్యలను పరిష్కరించలిగేలా సామర్థ్యం కలిగి ఉండాలని వ్యాఖ్యానించారు. కశ్మీర్ లాంటి ప్రధానమైన సమస్యలపై మాట్లాడేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు కావాలని పాక్ ప్రధాని షెహ్‍బాజ్ షరీఫ్ అన్నారు.

కశ్మీర్ లాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు కీలకమైన, నిజాయితీతో కూడిన చర్చలు చేసేందుకు అనుమతించాలని భారత ప్రభుత్వం, ప్రధాని మోదీకి నేను సందేశం ఇస్తున్నానని, శాంతియుతంగా ఉంటూ అభివృద్ధి సాధించడం లేదా ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూ వనరులను వృథా చేసుకోవడం అనే మార్గాలు ఉన్నాయి. ఏది కావాలో మనమే ఎంపిక చేసుకోవాలని షెహ్‍నాజ్ అన్నారు. బాంబులు, ఆయుధాలకు వనరులను ఖర్చు చేయాలని పాకిస్థాన్కోరుకోవడం లేదని చెప్పారు.

ఇరు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, ఒకవేళయుద్ధమంటూ జరిగితే.. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలి ఉండరు అని పాక్ ప్రధాని షెహ్‍బాజ్ షరీఫ్ అన్నారు. కశ్మీర్ తమ దేశఅంతర్గత విషయం అని భారత్ చెబుతున్నా.. పాకిస్థాన్ మాత్రం కుటిలత్వాన్ని కొనసాగిస్తోంది. కశ్మీర్ సమస్య పరిష్కారం అంటూ శాంతి పలుకులు పలుకుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్‍తో పాటు చాలా దేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. కశ్మీర్ గురించి మాట్లాడే అర్హత పాకిస్థాన్‍కు లేదని ఐక్యరాజ్య సమితి సమావేశాలతో పాటు చాలా అంతర్జాతీయ వేదికలపై భారత్ స్పష్టం చేసింది.

అయినా, అదే అంశాన్ని లేవనెత్తుతోంది పాకిస్థాన్. ఇప్పుడు పాక్ ప్రధాని కూడా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ..భారత ప్రధాని మోదీతో చర్చలు కావాలని వ్యాఖ్యానించారు. మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌.. భారత్‌ కరుణ కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కలేక, పాక్‌ పౌరుల ఆకలి తీర్చలేక నానా తిప్పలు పడుతున్న పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తాజాగా సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్‌ తనేంటో తెలుసుకుంది. గుణపాఠం నేర్చుకుంది. భారత్‌తో శాంతిని కోరుకుంటోంది.

శాంతికాముక దేశంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. కశ్మీర్‌ సహా ఇతర కీలక సమస్యలపై నిజాయితీగా చర్చించేందుకు ప్రధాని మోదీతో కలిసి మాట్లాడాలనిభావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ కూడా దీనికి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. భారత నాయకత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోదీకి నేను చెప్పేది ఒక్కటే. మనం కూర్చుని చర్చించుకుందాం. సీరియస్ గా, సిన్సియర్‌గా మాట్లాడుకుందాం. కశ్మీర్‌ సహా అన్ని అంశాలను పరిష్కరించుకుందాం అని అన్నారు.

మరోవైపు భారత్‌తో చర్చల విషయాన్ని యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు షరీఫ్‌ చెప్పారు.జాయెద్‌కు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాలు చర్చలకు దిగేలా ఆయన ముఖ్యపాత్ర పోషిస్తారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం పాకిస్థాన్‌ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. చమురు కొరత, గోధుమ పిండి కూడా ప్రజలకు అందకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు.. తెహ్రీక్‌ ఏ తాలిబన్‌ పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ నుంచి సర్కారుకు బెదిరింపులు పెరుగుతున్నాయి.

తిండితిప్పలు లేక అలమటిస్తున్న పాకిస్తాన్‌ ఇప్పుడు దారికొస్తోంది. భారత్‌తో మూడు యుద్దాలు చేసి తప్పు చేశామని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. ఆర్ధికసంక్షోభం నుంచి తమ దేశాన్ని గట్టెక్కించాలని కోరుతున్న షెహబాజ్‌ యుద్దాల నుంచి పాకిస్తాన్‌ గుణపాఠం నేర్చుకుందని అన్నారు. ఇండియాతో శాంతిని కోరుకుంటున్నామని ప్రకటించారు. కశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చలకు ముందుకు రావాలని భారత్‌ను కోరారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు.

యుద్దం కారణంగా ఇరుదేశాలకు నష్టం జరుగుతోందని , ఆర్ధికవనరులను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు పాక్‌ ప్రధాని. ఉభయదేశాల దగ్గర ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని అన్నారు. దక్షిణాసియా కోసం ఈ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆయుధాల పోటీ రెండు దేశాలకు తీరని నష్టం చేస్తోందని అన్నారు షెహబాజ్‌ షరీఫ్.

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ తమ పౌరులకు కనీస నిత్యావసర వస్తువులను సబ్సిడీ కింద ఇవ్వలేకపోతోంది. ద్రవ్యోల్బణంతో పాక్‌ ప్రజలు అల్లాడిపోతున్నారు. గోధుమ పిండి కోసం పాకిస్తాన్‌లో యుద్దాలే జరుగుతున్నాయి. ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి అధికధరలు , తాలిబన్ల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌ ఇప్పడు శాంతి ప్రవచనాలు వల్లిస్తోంది. యుద్దం వద్దని భారత్‌ను వేడుకుంటోంది.

జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో ఇటీవల అన్నారు. తాజా ఇంటర్వ్యూలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ప్రస్తావించిన పాక్ ప్రధాని వాటిని విస్మరించలేమన్నారు. పాకిస్తాన్‌ లో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి ధరలు ఆకాశానికి అంటుతూ గోధుమ పిండి కోసం కూడా భారీ క్యూలు, తొక్కిసలాటలు జరిగి సామాన్యులు చచ్చిపోతు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ కీలక వ్యాఖ్యలు తెలిపారు.

క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఆపాల‌ని ,ఇరు దేశాల్లో నిపుణులైన ఇంజనీర్లు, వైద్యులు ఉన్నారని, వారిని భారత్, పాకిస్తాన్ ల అభివృద్ధికిఉపయోగించుకునే అవసరం రెండు ప్రభుత్వాలకు ఉందన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయంటూ, ఒకవేళ దేవుడే కనుక యుద్ధానికి ఆదేశిస్తే అప్పుడు ఏం
జరిగిందో చెప్పడానికి ఎవరు మిగిలి ఉంటారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్, ఆహార‌ సంక్షోభం, ఇంధన కొరత కారణంగా పాలకులపై ప్రజల్లో అసంతృప్తి, నిషేధిత సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాక్ ప్రధాని మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Must Read

spot_img