Homeజాతీయంమళ్లీ వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ బిల్లు తెరపైకి వచ్చింది.ఇంతకీ బిల్లు కథేంటి..?

మళ్లీ వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ బిల్లు తెరపైకి వచ్చింది.ఇంతకీ బిల్లు కథేంటి..?

మళ్లీ వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ బిల్లు తెరపైకి వచ్చింది. ఈ దఫా ఏకంగా 80 సవరణలు, పది కీలక సూచనలతో .. మరోసారి
చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ బిల్లు కథేంటి..? బిల్లులో ఏ అంశాలపై చర్చ వెల్లువెత్తుతోంది..? లెట్స్ వాచ్..

పౌరుల వ్యక్తిగత సమాచారంపై బిల్లు .. ఎంతవరకు సమంజసం అన్న చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అయితే దీనికి కేంద్రం చెబుతోన్న వాదన
సైతం సహేతుకంగానే ఉందన్న టాక్ కూడా వెల్లువెత్తుతోంది. మరి .. ఈ బిల్లుపై న్యాయ నిపుణులు చెబుతున్నదేమిటి..?

వ్యక్తిగత డిజిటల్ సమాచార పరిరక్షణ బిల్లు తాజా ముసాయిదాతో మళ్లీ ముందుకొచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లులపై అనేక
అభ్యంతరాలు వ్యక్తం అవడంో అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 80కి పైగా సవరణలు, పదికి పైగా కీలక సూచనలతో కేంద్రం మరోసారి
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022 ను సిద్ధం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది.

ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టదలచిన ఈ బిల్లుపై న్యాయ నిపుణులు అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్నింటిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ సార్వభైమాధికారం, శఆంతి భద్రతలను పరిరక్షించేందుకు అవసరమైతే పౌరుల సమ్మి లేకుండానే వ్యక్తి సమాచారాన్ని తీుసుకోవచ్చన్న క్లాజుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు తాజా ముాసయిదాలో అనేక సానుకూల అంశాలున్నారయి. సరళమైన భాషను ఉపయోగించారు. మౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, చట్ట నియంత్రణలో ఉండే విధానాలకు రూకల్పన చేశారు. అయితే వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం ఈ తాజా ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అశాలు లోపభూయిష్టంగా ఉండడం ఆందోళన కలగించే విషయమే.

మెత్తంగా చూస్తే ఈ ముసాయిదా బిల్లుల దేశ ప్రజల సాంకేతిక భత్రతా చట్టాలను బలపరిచేదిగా నిలిచిపోతుంది. గత నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసి, అందులోని బాగోగులను చర్చకు పెట్టింది. గత నాలుగేళ్లుగా ఏకాభిప్రాయానికి
నోచుకోక, ఇక ఇది ఎప్పిటికైనా బిల్లు రూపంలో వస్తుందా అనే సందేహాల నడుమ తాజాగా బయటకి వచ్చిన ముసాయిదాను ప్రభుత్వ శీతాకాల
సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

ఇక ఈ ముసాయిదా చట్టంలోని ఇతర సఅంశాలలో కొన్నింటిపైనా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

చట్టంలో అనేక ముఖ్యమైన నిబంధనల వర్తింపు నుంచి ప్రభుత్వం తనను తాను మినహాయించుకోవడం దానిలో ఒకటి. అయితే ప్రపంచంలోని ప్రతి డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ ఈ రకమైన మినహాయింపు కనిపిస్తుంది. ఉదాహరణకు ఐరోపాలో అమల్లో ఉన్న జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం తన మేలిమి ప్రమాణాల రీత్యా తలమానికమైనదిగా గుర్తింపు పొందుతుంది. వారి చట్టంలో జాతీయ భద్రత, దేశ రక్షణ, పౌరుల సంక్షేమం రీత్యా క్రిమినల్ నేర విచారణ, రహస్య ఛేదన వంటి హక్కు దావాల నుంచి ప్రభుత్వానికి స్పష్టమైన మినహాయింపులు ఇస్తున్నాయి. సరిగ్గా మన తాజా ముసాయిదాలోని సెక్షన్ 18(1)
ప్రసాదిస్తున్న మినహాయింపులు అటువంటివే. అయితే డేటా పరిరక్షణ చట్టంలోని కొన్ని నిబంధనల వర్తింపు నుంచి ప్రభుత్వం మినహాయింపు
తీసుకున్నంత మాత్రానా 2017 పుట్టస్వామి తీర్పును అనుసరించి తన రాజ్యాంగ బద్ధతలకు లేదా బాధ్యతలకు ప్రభుత్వం లోబడి ఉండదని అర్థం
కాదు. బిల్లులో నిర్దిష్ట మూలాంశం ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్చపై ఆ బద్దతలు, బాధ్యతలు శిరస్సుపై ఖడ్గంలా వేలాడుతూనే
ఉంటాయి. ప్రస్తుతం బిల్లుకు జరుగుతూ వస్తోన్న సవరణలతో పోల్చి చూసినప్పుడు ముసాయిదాలో పేర్కొన్న మినహాయింపులు నిరపాయకరమైనవేనని చెప్పాలి. చట్టానికి జరిగిన గత రెండు సవరణలు చట్టంలోని కొన్ని సెక్షన్ల వర్తింపు నుంచి ప్రభుత్వ యంత్రాంగాలకు మొత్తంగా మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనలు కలిగి ఉన్నాయి. తాజా ముసాయిదా కొంత తులనాత్మకంగా జరిగింది.

దీనర్థం తాజా ముసాయిదాలో లోపాలు లేవని చెప్పడం కాదు.. ఇందులో డేటా ప్రొటెక్షన్ కు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని
ప్రధానమైన పరిగణనలు లోపించాయి. మొటిగా .. డేటా పోర్టబిలిటీ హక్కు. దేశ జనాభాలోని వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ
ఓకచోట నిల్వ ఉంచుతున్న ఈ యుగంలో .. అలా నిల్వ ఉంచిన సమాచారం నుంచి వివరాలు సంగ్రహించి, బట్వాడా చేసుకునే హక్కును వ్యక్తులకు
ఈ బిల్లు కల్పించలేదు. డేటా పోర్టబులిటీ హక్కు ఉంటే కనుక వ్యక్తులకు తమకు అవసరమైన వివరాలపై అధీనతను ఇవ్వడమే కాకుండా కొద్ది
మంది చేతుల్లో డేటా పోగుపడే ఏకీకరణను నిరోధించే సమర్థమైన చర్యగా కూడా పోర్టబిలిటీ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా
నియంత్రణ పోర్టబిలిటీ హక్కును మరింత ప్రభావవంతంగా, అర్థవంతంగా చేయడానికి శ్రమిస్తున్నారు. భారతదేశమైతే, తన శక్తివంతమైన టెక్నో లీగల్
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో, డేటా పోర్టబిలిటీ ఏలా చేయాలో ప్రపంచానికి చూపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముందైతే అటువంటి హక్కుకు చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉండాలి. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ డేటా సబ్జెక్టులను డేటా ప్రిన్సిపల్స్ గా, డేటా కంట్రోలర్స్ గా, డేటా విశ్వసనీయులుగా పున:నామకరణం చేసినప్పటి నుంచి ఆ తర్వాత వరుస ముసాయిదాలు ప్రామాణికం కాని ప్రమాణఆలను చట్టంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాయి. అందుకు ప్రస్తుతం ఉన్న ఈ ముసాయిదా కూడా మినహాయింపేమీ కాదు. ప్రపంచంలోని మిగతా దేశాలు డేటా ప్రొటెక్షన్ అధారిటీగా పిలిచే శాఖను మన దగ్గర డేటా ప్రొటెక్షన్ బోర్డుగా వ్యవహరిస్తున్నారు. ఇక గోప్యత చట్టాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే చట్టబద్ధమైన అవసరం, సహేతుకమైన ప్రయోజనం వంటి మాటలు తాజా చట్టంలోనూ ఉన్నాయి.

దీనివల్ల వ్యక్తుల సమ్మతి లేకుండానే వారికి సంబంధించిన వివాలను ప్రభుత్వం, ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థ పొందే వీలుంది. ఇది వ్యక్తిగత
స్వయంప్రతిపత్తిని మరింతగా దెబ్బ తీస్తుందనే ఆందోళన ఉన్నందువల్ల దీనిపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజల వ్యక్తిగత
సమాచారంపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేట్లు బిల్లు ఉందని విపక్షాల వాదన. కేంద్ర ప్రభుత్వం పౌరుల, సంస్థల వ్యక్తిగత సమా చారాన్ని రక్షించే
పేరుతో తీసుకొస్తున్న బిల్లులో అంశాలపై విపక్షాలు ముందే పెదవి విరుస్తున్నాయి. ఈ బిల్లు వల్ల పౌరుల, సంస్థల వ్యక్తిగత సమాచారం రక్షణ
సంగతేమో కానీ కేంద్రానికి మాత్రం వారిపై పెత్తనం చెలాయించే విశేషాధికారాలు దఖలు పడటం ఖాయమంటున్నారు. ఈ బిల్లులో పొందుపరి చిన
చాలా అంశాలపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లు యథాతథంగా పార్లమెంటులో ఆమోదం పొందితే కేంద్రం తమకు కావాల్సిన వారి డేటాను మాత్రమే రక్షించే వీలుంటుందని, మిగతా డేటా కేంద్రం చేతుల్లోకి వెళుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే సంస్థలను అదుపులో పెట్టేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు తెలిపారు. చట్టంలోని బంధనలు ఉల్లంఘిస్తే గరిష్ఠంగా రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. డేటా ప్రొటెక్షన్ బిల్లును 2019లోనే కేంద్రం తీసుకొచ్చింది. అయితే, విపక్షాలు వ్యతిరేకించడంతో బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. పరిశీలించిన కమిటీ బిల్లులో 81 సవరణలను ప్రతిపాదించింది. దీంతో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసి ‘డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ బిల్-2022’ పేరుతో శీతాకాల సమావేశాల్లో తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ బిల్లులో డేటా పొర్టబిలిటీ వ్యక్తులకు కూడా ఉండాలన్నది ఓ వాదనైతే, ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి మినహాయింపులు ఇవ్వడం మరో
చర్చకు కారణమవుతోంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img