తాజాగా జీ20 మీటింగ్ గురించి అలాంటి ఓ కథనం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. అదెలా సాగిందంటే.. మోడీ స్కెచ్ వేస్తే అంతే.. జీ20 మీటింగ్ వెనుక పెద్ద కథే ఉంది. నిజానికి మోడీ అంతు పట్టరు. అంతు చిక్కడు. కాశ్మీర్ కు సంబంధించి స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. కానీ తర్వాత ఆయన మదిలో ఉన్న ఆలోచనలు మొత్తం అమల్లో పెట్టారు. ఇప్పుడు అక్కడ సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఆపై కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కలుగజేసుకోకుండా ఉండాలి అంటే బలమైన దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ కూడా చాలా సాలిడ్ గా ఉండాలి. అందుకే చాలా కాలం వరకు వేచి చూసారు.. చాలా సుదీర్ఘ గ్యాప్ తరువాత మోడీ కోరుకున్నట్టుగానే జి20 అధ్యక్ష రూపంలో వచ్చింది.

బయట గెలిచారు సరే.. ఇంటి మాట ఏమిటి? ఏముంది…
అనుకున్నదే తడవుగా ఢిల్లీలో రాష్ట్ర పతి భవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అందరితో దగ్గరికి వెళ్లి మాట్లాడారు. సీతారాం ఏచూరి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడి వరకు అందరితో పిచ్చా పాటిగా మాట్లాడారు. తర్వాత అందరు కూడా మీ నాయకత్వం కావాలి అన్నారు.. మోడీకి కావాల్సింది అదే. నిజానికి అక్కడ జరిగిందేంటి..? రోగి కోరింది పాలే డాక్టరు ఇచ్చింది పాలే అన్నట్టుగా జరిగింది. ఇక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కు సాలిడ్ దెబ్బ. తర్వాత జరగబోతున్నది కూడా కూడా అదే. కాశ్మీర్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగ్రవాద దాడులు..అక్కడి రాజకీయ నాయకుల విచిత్రమైన భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు. కేంద్రంపై పొంతన లేని విమర్షలు ఆరోపణలు.. నిత్యం బాంబు మోతలతో హోరెత్తిపోయే ప్రాంతాలు.. ఎప్పుడు ఏ బాంబు ఎవరి మీద పడుతుందో తెలియదు..
ఎప్పుడు ఏ ఉగ్రవాది ఇంటి తలుపు తడతాడో తెలియదు. నా అనే వాళ్ళు రారు. పేరుకు అది భూతల స్వర్గమే కానీ… అక్కడి ప్రజలు అనుభవించేది మాత్రం నిత్య నరకం. అక్కడ దేశ రాజ్యాంగం అమలు కాదు. దేశం జెండా కూడా అప్పట్లో ఎగిరేది కాదు. చెప్పుకోడానికి భారతదేశంలో భాగమే కానీ.. అదొక స్వతంత్ర ప్రాంతంగా ఉండేది. అక్కడి వారి మాటల్లో కూడా వారేదో తమది కాని దేశంలో జీవిస్తున్నట్టు మాట్లాడేవారు. కానీ 2019 లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదాను ఎత్తేసి.. జమ్ము, లడక్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంతో కొత్త చరిత్ర మొదలైంది. అంతేకాదు ఈ ప్రాంతానికి సమర్ధుడైన లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమించడంతో నయా కాశ్మీర్ రూపు దిద్దుకుంటోంది. మనోజ్ సిన్హా ను లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించిన తర్వాత క్షేత్రస్థాయిలో కేంద్రం పక్కాగా తన వ్యూహాలను అమలు చేస్తోంది. పాలనా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అవినీతి అంతానికి కంకణం కట్టుకుంది. అంతేకాదు మనోజ్ నాగరిక్ పేరుతో ఒక యాప్ ను అందుబాటులోకితీసుకొచ్చారు. దీని ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువు లోగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి 105 మంది ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఉద్యోగులు ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించడాన్ని మనోజ్ తప్పనిసరి చేశారు.. ఖాళీల భర్తీకి నిర్దిష్ట నియామక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో అర్హులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ పనుల నిర్వహణ కోసం టెండర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం కూడా పాలనలో పారదర్శకతను పెంచింది.. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్లో 29వేల 813 పోస్టులు భర్తీ చేశారు. ప్రస్తుతం 1 వేయి 087 గెజిటెడ్, 4 వేల 436 నాన్ గెజిటెడ్ పోస్టులు, 3 వేల 175 క్లాస్ 4 ఉద్యోగుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టారు.
అంతే కాదు విదేశాల నుంచి జమ్ము కాశ్మీర్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త విధానం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 55వేల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి..వాటిలో 34వేల 454 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 3 వేల 379 దరఖాస్తులను పరిగణలోకి తీసుకొన్నారు. అక్కడ భూమిని మనం ఎకరాలలో గణించినట్టు కనాల్ లలో లెక్కలు కడతారు.ఒక కనాల్ ఎకరం భూమితో సమానం..19 వేల 961 కనాల్ ల భూమిని వారికోసం కేటాయించారు. దీనివల్ల కొత్తగా 1 లక్షా 60 వేల ఉద్యోగాలు వస్తాయనేది అంచనా. నూతన పారిశ్రామిక విధాన కింద దరఖాస్తు చేసుకున్న వారికి 75 రోజుల్లో ఆన్ లైన్ ద్వారానే భూమి కేటాయింపులు పూర్తి చేస్తున్నారు. ప్లాంట్ అండ్ మిషనరీ పై 400 % ప్రోత్సాహకం అందిస్తున్నారు. దీనివల్ల యాపిల్అధికంగా పండే పుల్వామా జిల్లాలో వాటి శుద్ధి, నిల్వకు సంబంధించిన ఆధునిక పరిశ్రమలు భారీగా వచ్చాయి.. ఇదే జిల్లాలో పెన్సిళ్ళ తయారీ, క్రికెట్ బ్యాట్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతే కాదు..చాలా కీలకంగా భావిస్తున్న జి20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడే శిఖరాగ్ర సదస్సు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక హోదా తొలగించక ముందు కాశ్మీర్ ఎలా ఉంది? తొలగించిన తర్వాత ఎలా మారింది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రపంచ దేశాలకు చూపించేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు. పనిలో పనిగా కాశ్మీర్ విషయాన్ని పదేపదే గెలుకుతున్న చైనా, పాకిస్తాన్ దేశాలకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు.. అందులో భాగంగానే కాశ్మీర్ అభివృద్ది కి సంబంధించి భారత్ ఎలా కట్టుబడి ఉందో చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు కేంద్ర భద్రత సలహాదారు అజిత్ దోవల్ కాశ్మీర్ వెళ్లి వచ్చారు. అయితే ఈ పరిణామంపై అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ నోరు మెదపకపోవడం చూస్తే మోదీ ప్లాన్ ఇప్పటికే సగం ఫలించినట్టు చెబుతున్నారు విశ్లేషకులు.
ఇక్కడ మన దేశం గురించి మన ప్రధాని గురించి ప్రపంచం ఏమని అనుకుంటుందో కూడా ఒకసారి చూద్దాం..

ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిలా మారేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ పెద్దన్నలా ప్రధాని మోడీ.. కీలక విషయల్లో ముందడుగు వేయడం.. పలు అంతర్జాతీయ సమస్యలను ప్రపంచ వేదికలపై ప్రస్తావించడం.. లాంటి పరిణామాలతో పెద్ద దేశాలు సైతం ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం మరికొన్ని కీలక అంశాల్లో భారత్‌తో దోస్తీకి ఉవ్విళ్లూరుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచ వేదికలపై ప్రధాని మోడీ మేనియా మార్మోగుతోంది. మోడీతో మాట్లాడేందుకు.. భారత్‌తో దోస్తీకి ప్రపంచ నాయకులు కనబరుస్తున్న ఆసక్తే దీనికి నిదర్శనం..భారతదేశం-అమెరికా సంబంధాల చరిత్రలో 2022 సంవత్సరం కీలకం కానుంది.. వచ్చే సంవత్సరం 2023లో దౌత్య సంబంధాలు అగ్రభాగాన ఉంటాయని స్వయంగా వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్ తో బంధాన్ని అత్యంత కీలక సంబంధాలలో ఒకటిగా చూస్తుందని వైట్‌హౌస్ కీలక అధికారి స్పష్టంచేశారు. ఇండోనేషియాలోని బాలి ప్రావిన్స్‌లో ఇటీవల ముగిసిన G-20 సమ్మిట్ ముగింపులో విడుదల చేసిన ‘ఉమ్మడి ప్రకటన’ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించినందుకు ప్రిన్సిపల్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ కూడా ప్రశంసించారు. ప్రెసిడెంట్ జోబైడెన్.. ప్రధాని మోడీ మధ్య జరిగిన చర్చలు దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల విషయానికొస్తే ప్రధాని మోదీ అందులోనూ విజయం దిశగా ముందుకు పోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. సో..తాను ఇంటా గెలుస్తూ బయటా గెలుస్తున్నట్టు రుజువు చేసుకున్నారు భారత ప్రధాని నరేంద్రభాయ్ మోదీ.