Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులు...

బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులు…

బంగ్లాదేశ్ నుంచి కొంత మంది శరణార్థులు భారత్ కు చేరుకున్నారు.. బంగ్లాదేశ్ ఆర్మీ… కుకీ చిన్ నేషనల్ ఆర్మీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ నుంచి తప్పించుకునేందుకు పారిపోయి భారత్ కు వచ్చినట్లు శరణార్ధులు చెబుతున్నారు.. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులు చెప్పే కారణాలు ఒక విధంగా ఉంటే.. బంగ్లాదేశ్ పోలీసులు చెప్పేది మరొక విధంగా ఉంది.. ఇంతకూ బంగ్లాదేశ్ కు చెందిన వారు భారత్ లో ఆశ్రయం పొందడానికి గల ప్రధాన కారణం ఏంటి..?

బంగ్లాదేశ్‌ లోని బండార్బన్ జిల్లా నుంచి పారిపోయి వచ్చిన 500 మంది… భారత్‌ లోని మిజోరం రాష్ట్రంలో ఆశ్రయం పొందారు.కుకీ చిన్ నేషనల్ ఆర్మీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నుంచి తప్పించుకునేందుకు పారిపోయి భారత్‌కు వచ్చినట్లు వారు చెబుతున్నారు.అయితే, వారంతా దేశం నుంచి పారిపోలేదని, భద్రతా కారణాల రీత్యా సరిహద్దు దాటి వెళ్లారని బంగ్లాదేశ్ పోలీసులు అంటున్నారు.గతేడాది నవంబర్ నుంచే ఈ శరణార్థులు, భారత్‌కు రావడం ప్రారంభించారని మిజోరం మంత్రి ఒకరు వెల్లడించారు..ఆశ్రయం కోరుతున్న వారిలో ఎక్కువ మంది ‘బమ్’ తెగకు చెందినవారు ఉన్నారు. వీరితో పాటు టంగ్‌టంగియా తెగకు చెందిన కొంతమంది కూడా ఉన్నారు..

బమ్ తెగ ప్రజలు క్రైస్తవులు. ఈ బంగ్లాదేశీ తెగకు చెందిన పౌరులలో మహిళలు కూడా ఉన్నారు. దక్షిణ మిజోరాంలోని లాంగ్‌తలై జిల్లాకు చెందిన అయిదు గ్రామాల్లో వారు ఆశ్రయం పొందారు.మిజోరం ప్రభుత్వంతో పాటు స్థానికంగా ప్రముఖ క్రైస్తవ సంఘమైన ‘యంగ్ మిజో అసోసియేషన్ ’ వారు ఈ శరణార్థుల కోసం బస, ఆహార ఏర్పాట్లను చేశాయి.. బంగ్లాదేశ్‌కు చెందిన 132 కుటుంబాల్లోని 548 మంది ప్రజలు ఆశ్రయం పొందారు. వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. వారే స్వయంగా వంట చేసుకుంటారు. దుస్తులు, ఔషధాలు కూడా ఇస్తున్నారు. చాలా మందికి చిన్న చిన్న ఇళ్లను ఏర్పాటు చేశారు..టుయ్‌చాంగ్ ప్రాంతంలోని పర్వ్-3 గ్రామంలో ఎక్కువమంది శరణార్థులు నివసిస్తున్నారు. వైఎంఏ, మిజోరం ప్రభుత్వాలు తరచుగా శరణార్థుల సంఖ్యను లెక్కిస్తున్నాయి.

చివరగా సేకరించిన గణాంకాల ప్రకారం, ఆ శరణార్థి శిబిరంలో 216 మంది నివసిస్తున్నారు. అందులో కొంతమంది వెదురుబొంగులతో ఇళ్లను కట్టుకున్నారు. మరికొందరు పెద్ద హాళ్లలో జీవిస్తున్నారు. ఇళ్ల.. ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని కూడా స్థానిక మిజో ప్రజలే వారికి అందజేశారు. ఈ శరణార్థి శిబిరంలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతోన్న వారు బంగ్లాదేశ్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.‘‘బంగ్లాదేశ్ సైన్యం, వారి గ్రామాలపై దాడులు చేస్తుండటంతో పాటు తరచుగా ఫైరింగ్ చేశారు.. అంతేకాదు.. ఆర్మీ వాళ్లు పలువురని వారి వెంట తీసుకెళ్లడంతో..

భయాందోళనకు లోనైన స్థానిక ప్రజలు అడవి మార్గంలో పారిపోయి భారత్ కు చేరుకున్నారు..బంగ్లాదేశ్ ఆర్మీ గతేడాది నవంబర్ 15న బైలియాన్ గ్రామంలో ఆపరేషన్‌ను ప్రారంభించింది. మరుసటి రోజే ప్రజలంతా ఆ గ్రామం నుంచి పారిపోయారు.బండార్బన్ జిల్లా రూమా పాడా ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు కూడా ఈ శిబిరంలో ఆశ్రయం పొందారు. తొలుత వారంతా ఒక పెద్ద హాలులో చాలా మందితో కలిసి ఉండాల్సి వచ్చింది.ఆ తర్వాత వైఎంఏ, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంటికి కావాల్సిన సామగ్రిని సమకూర్చారు. వాటితోనే కొంతమంది ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు.

ఈ శరణార్థి శిబిరంలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతోన్న వారు బంగ్లాదేశ్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.‘‘బంగ్లాదేశ్ సైన్యం, వారి గ్రామాలపై దాడులు చేస్తుండటంతో పాటు తరచుగా ఫైరింగ్ చేశారు.. అంతేకాదు.. ఆర్మీ వాళ్లు పలువురని వారి వెంట తీసుకెళ్లడంతో.. భయాందోళనకు లోనైన స్థానిక ప్రజలు అడవి మార్గంలో పారిపోయి భారత్ కు చేరుకున్నారు..బంగ్లాదేశ్ ఆర్మీ గతేడాది నవంబర్ 15న బైలియాన్ గ్రామంలో ఆపరేషన్‌ను ప్రారంభించింది. మరుసటి రోజే ప్రజలంతా ఆ గ్రామం నుంచి పారిపోయారు. బండార్బన్ జిల్లా రూమా పాడా ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు కూడా ఈ శిబిరంలో ఆశ్రయం పొందారు. తొలుత వారంతా ఒక పెద్ద హాలులో చాలా మందితో కలిసి ఉండాల్సి వచ్చింది.ఆ తర్వాత వైఎంఏ, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంటికి కావాల్సిన సామగ్రిని సమకూర్చారు. వాటితోనే కొంతమంది ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు.

అయితే.. ఇది వలస సమస్య కాదు. భద్రతా సమస్యల వారు గ్రామాలను విడిచి వెళ్లిపోయారు. మొదట్లో కూడా వారు ఆశ్రయం కోసం మిజోరం ప్రాంతానికే వెళ్లేవారు..ఆర్మీ ఆపరేషన్ కారణంగా దాదాపు నాలుగైదు వందల మంది గ్రామాలను విడిచి వెళ్లిపోయారు..కేఎన్‌ఎఫ్‌ సంస్థకు వ్యతిరేకంగా ఈ ఆర్మీ ఆపరేషన్ జరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. ఈ తెగకు చెందిన ప్రజలే ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఏ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి, ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నారనే సంగతి ఆర్మీ వారికి బాగా తెలుసు.. కేఎన్‌ఎఫ్ సభ్యులు ఆయుధాల వాడకంలో శిక్షణ పొందుతున్నారు. ఆ కాల్పులు శబ్ధాలు విని భయబ్రాంతులకు గురైన సామాన్యులు సరిహద్దులు దాటి ఉండొచ్చు. సరిహద్దు దాటాల్సిందిగా వారిపై ఎవరి ఒత్తిడి లేదనేది పలువురి అభిప్రాయం…

కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ అనేది ఒక రాజకీయ సంస్థ. ఈ సంస్థకు కుకీ చిన్ నేషనల్ ఆర్మీ అనే సాయుధ విభాగం కూడా ఉంది.బంగ్లాదేశ్ సైన్యంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ వర్గాలు నిరంతరం కేఎన్‌ఎఫ్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంటాయి. మిజోరం గ్రామీణాభివృద్ధి మంత్రి లాల్‌రుట్కిమా, కొద్ది రోజుల క్రితం పర్వ్-3 గ్రామంలో పర్యటించారు.. ఈ గ్రామంలోనే ఎక్కువ మంది బంగ్లాదేశ్ పౌరులు శరణార్థులుగా జీవిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న శరణార్థులు, మిజో ప్రజల కుటుంబ సభ్యులే. తమ పూర్వీకుల్లో కొంతమంది బండార్బన్, మియాన్మార్‌లో నివసించేవారు. మరికొందరు ఇక్కడ మిజోరంలో ఉండేవారు. ఇప్పటికీ చాలామంది బండార్బన్, మియన్మార్‌లలో నివసిస్తున్నారు. కాబట్టి ఇక్కడి ప్రజలు కూడా శరణార్ధులుగా వచ్చిన వారిని తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నారు.. ఈ శరణార్థులు, మిజోరం ప్రజల సోదర సోదరీమణులని పేర్కొంటూ మిజోరం అసెంబ్లీలో తీర్మానాన్ని చేశారు. కాబట్టి వారి వసతి, ఆహార ఏర్పాట్లు చేయడం మిజోరం ప్రభుత్వ బాధ్యతగా మారింది. బీఎస్‌ఎఫ్ సిబ్బంది, శరణార్థులను సరిహద్దుల వద్ద అడ్డుకోకుండా చూడాలని మిజోరం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Must Read

spot_img