Homeసినిమాన్యూ ఇయర్ కి కొత్త సినిమా ధమాకా….

న్యూ ఇయర్ కి కొత్త సినిమా ధమాకా….

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రం ధమాకా. ఈ చిత్రానికి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. అత్యున్నత ప్రమాణాలు, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన టిజి విశ్వ ప్రసాద్ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్ ఎక్కువగా చూపించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ స్టార్ట్ చేసింది టీమ్. తాజాగా హీరోయిన్ శ్రీలీల ఫ్యాన్స్ తో మీట్ నిర్వహించారు.

నిర్మాత దిల్ రాజు 2003లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ నిర్మాణ సంస్థను స్థాపించి హిట్ మూవీ దిల్ తో టాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆతర్వాత పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇప్పుడు ఆయన కుటుంబంలోని రెండవ తరం చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. కొత్తగా ప్రారంభించిన దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డిలు నిర్మాతలుగా బలగం సినిమాతో తమ కెరీర్‌ను మొదలు పెడుతున్నారు. శిరీష్ సమర్పణలో వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యలు హీరోహీరోయిన్లు.

సినిమా ఇండస్ట్రీలో హీరోలదే ఆదిపత్యం అనడంలో సందేహం లేదు. థియేటర్ కు ప్రేక్షకులను రప్పించడం కేవలం హీరోలకే సాధ్యం. అతి కొద్ది మంది దర్శకులు కూడా హీరో హీరోయిన్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్ కురప్పించగలరు. ఇక హీరోయిన్స్ లో కూడా కొందరు ఇతర స్టార్ కాస్ట్ లేకుండా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న వారు ఉన్నారు.

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా మందే చేశారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా మారింది. అరుంధతి సినిమా తర్వాత అనుష్క స్థాయి స్టార్ హీరో రేంజ్ లో పెరిగింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా ఆమె ఫేస్ వ్యాల్యూతోనే సక్సెస్ అవ్వబోతున్నాయి. ఇక సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న నయనతార కూడా హీరోల స్థాయిలో తన సినిమాలతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల సత్తా ఉంది.

పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల సంఖ్య తగ్గించింది. ప్రస్తుతం పిల్లల యొక్క ఆలనా పాలనతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మళ్లీ బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక సమంత వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ లతో దూసుకు పోతుంది. ఈ సమయంలో అనూహ్యంగా ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె మళ్లీ పూర్వ వైభవం ను దక్కించుకుని తన సత్తా చాటాలని.. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో తన సినిమాతో వసూళ్లు దక్కించుకోవాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.ఇక అనుపమ పరమేశ్వరన్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఈమె హీరోలతో సంబంధం లేకుండా తనకు ఉన్న ఫాలోయింగ్ తో థియేటర్ కు అభిమానులను రప్పించగలదు. కీర్తి సురేష్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఆమె ఎంపిక చేసుకుంటున్న కథలు మరియు దర్శకులు సరిగా లేరు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమన్నా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్రయత్నించినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. వీళ్లు కాకుండా మరి కొందరు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలను ట్రై చేస్తున్నారు. కాని జనాలు వారిని ఆధరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రేక్షకులు కేవలం అనుష్క.. సమంత.. కీర్తి సురేష్.. నయనతార వంటి లేడీ సూపర్ స్టార్స్ యొక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Must Read

spot_img