Homeఆంధ్ర ప్రదేశ్గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ వేళ..జగన్ సర్కార్ కు ఇబ్బందులు

గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ వేళ..జగన్ సర్కార్ కు ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జరుగుతున్న రచ్చను చల్లార్చే ప్రయత్నం చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. సుప్రీం కోర్టు తీర్పుకు లోబడే సీఎం వైఎస్‌ జగన్‌ వైజాగ్ వెళ్తారని స్పష్టం చేశారు. అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యలపై వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు.. తాను క్లారిటీ ఇస్తున్నానని కూడా అన్నారు. బుగ్గన వ్యాఖ్యలు పూర్తిగా పరిశీలిస్తే.. వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.. ఏదేమైనా మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.. ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతామన్నారు. మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామన్నారు.

తమ ప్రభుత్వం ముందు నుంచి చెబుతునట్టు.. విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు సజ్జల.. రాజధాని అనేది కేవలం మనం పెట్టుకునే పేరు మాత్రమే అన్నారు. అమరావతిలో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు మాత్రమే ఇలా లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గన.. ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని, ఏపీ పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని..

తద్వారా ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అనే సంకేతాలిచ్చారు. ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ వాస్తవం కాదు అన్నారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా చూస్తే ఏపీ రాజధానిగా విశాఖే బెస్ట్‌ అని..రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందని, తమ ప్రభుత్వ నిర్ణయం కూడా అదేనని అన్నారు.. విశాఖ ఇప్పటికే ఓడరేవు నగరంగా, కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందని, భవిష్యత్ లోనూ విశాఖ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని.. కర్నూలు రెండో రాజధాని కాదని అన్నారు. అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్ ఉంటుందంతే అన్నారు. కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్గాలలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయన్నారు.

ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో పర్యటించిన ఆయన.. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు. 1920 శ్రీబాగ్ ఒప్పందం అంటే వికేంద్రీకరణ అందరికీ తెలిసిందే. దీంతో రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాజధాని ఇష్యూ దాటి ఎన్నికల రెఫరెండం వరకు వెళ్లాయి.

GOBAL SUMMIT VISHAKAPATNAM

మంత్రి బుగ్గన మాట్లాడిన విషయంలో అసలు కన్ఫ్యూజన్ లేదు. బుగ్గన మాట్లాడినప్పుడు ‘మిస్ స్పెల్’ అయ్యింది. వైజాగ్ స్టేచర్ ఎలివేట్ చేసే సందర్భంలో.. మిస్ స్పెల్ అయ్యింది. కానీ.. సీఎం జగన్ క్లారిటీతో ఉన్నారు. గతంలో చెప్పినట్టు పరిపాలన విశాఖలో, అసెంబ్లీ అమరావతిలో, హైకోర్టు కర్నూలులో ఉంటుంది. ఈ అంశాలతోనే మళ్లీ బిల్లు తీసుకొస్తాం. అందుకే విశాఖను రాజధానిగా చెబుతున్నాం. బుగ్గన చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ కూడా ఢిల్లీలో అదే విషయాన్ని చెప్పారు.

అమరావతిని వ్యతిరేకించాలనేది వైసీపీ విధానం కాదు. దమ్ముంటే ప్రతిపక్షాలు అమరావతి ఏకైక రాజధాని అని ఎన్నికలకు రావాలి. మేము కచ్చితంగా మూడు
రాజధానుల ఎజెండాతోనే ఎన్నికలకు వస్తాం’ అని మంత్రి సీదిరి స్పష్టం చేశారు. 2020 నుంచి ఎక్కువ చర్చ జరిగింది ఏపీ రాజధానులపైనే. 2019కి ముందు కూడా అమరావతి అనేది ఎన్నికల అంశంలో లేకుండా పోయింది. వికేంద్రీకరణ అని అందమైన పదంతో మూడు రాజధానులు అంటున్నారు. దీన్ని వైసీపీ మినహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది.

ఈ సమయంలో.. ఇది ఎన్నికల రెఫరెండంగా మారుతోంది. అందుకే ప్రతిపక్షాలు దీనిపై డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం ఇదేలా వాదిస్తోంది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని సజ్జల చెబుతున్నారు. ప్రజలకు అమరావతిపై అంత అనుకూలత లేదని వైసీపీ ఒక అంచనాకు వచ్చింది. అందుకే వైసీపీ మారడం లేదు. బుగ్గన చెప్పింది సత్యం. సజ్జల చెప్పింది వ్యూహం. అది ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదు’
అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన విషయానికి, సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పిన విషయాలకు చాలా తేడా ఉంది. బెంగళూరులో బుగ్గన చాలా క్లియర్‌గా చెప్పారు. విశాఖనే రాజధాని అని స్పష్టం చేశారు. దీంతో మూడు రాజధానులు వైసీపీ ఎజెండాలో లేవని అర్థం అవుతోంది. అసెంబ్లీ సమావేశాలు గుంటూరులో, హైకోర్టు బెంచ్ కర్నూలులో అంటున్నారు. ఇలా చేస్తే రాజధానులు అంటారా. ఇటీవల కర్నూలులో అంతపెద్ద సభ నిర్వహించి కర్నూలుకు హైకోర్టుతీసుకొస్తామన్నారు. అలా చెప్పిన బుగ్గన ఇప్పుడు విశాఖ ఏకైక రాజధాని అని చెబుతున్నారు. దీంతో వికేంద్రీకరణకు వ్యతిరేకం వైసీపీ అని అర్థం అవుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సజ్జల రామకృష్ణా రెడ్డి మూడు రాజధానులపై స్పష్టత లేకుండా మాట్లాడారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల ప్రకారం.. అమరావతే రాజధాని.

వైసీపీ పక్కా ప్లాన్ తోనే ప్రతిపక్షాలను, మీడియాను ట్రాప్‌లో పడేస్తున్నాయి. దీంతో అందరం వీటి వెనుక డిబేట్‌లు పెట్టుకొని పరుగెడుతున్నాం. శివరామకృష్ణన్ కమిటీకి మేము కూడా చెప్పాము.. విశాఖనే రాజధానిగా ఉండాలని, కానీ.. ఆఖరికి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దానికి జగన్ మమ అన్నారు. అప్పుడే ఎందుకు జగన్ కోర్టుకు వెళ్లలేదు. ఇప్పుడు కావాల్సింది అధికార వికేంద్రీకరణ.. రాజధానుల వికేంద్రీకరణ కాదు’ అని జనసేన మండిపడుతోంది. గతంలో ఎన్నడూలేనంతగా జగన్ సర్కారు తీవ్ర ఒత్తిడని ఎదుర్కొంటోంది. రాజధానుల అంశాన్ని తేల్చాలని భావిస్తోంది.

కానీ సాధ్యం కావడం లేదు. రాజధాని తేలితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కుదురుతుంది. అయితే రాజధానుల ఇష్యూ సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 23న విచారణ జరగనుంది. దీంతో పారిశ్రామికవేత్తలకు ఏంచెప్పాలో తెలియక వైసీపీ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇదిలా ఉంటే, విశాఖలో మార్చి 2,3 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేస్తోంది.అయితే ఈ సమావేశానికి హాజరైన జగన్ తాము విశాఖ నుంచి పాలన సాగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు
రావాలని కోరారు. కానీ దీనిని పారిశ్రామికవేత్తలు నమ్మడం లేదు.

అయితే రాజధానుల వ్యవహారంలో అపఖ్యాతిని ఎదుర్కొంటున్నవైసీపీ సర్కారు తీరుపై పారిశ్రామికవేత్తలు అనుమానపు చూపులు చూస్తున్నారు. దీంతో వారిని ఒప్పించేందుకేనైనా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని కేసును ఒక కొలిక్కి తేవాలన్న ప్రయత్నంలో జగన్ సర్కారు తెగ ఆరాటపడుతోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా ఉన్నవారు కేసును వీలైనంత వరకూ సుప్రీం కోర్టులో జాప్యం చేయాలని చూస్తున్నారు. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఇదే ఫార్ములాను అనుసరించింది. కానీ సుదీర్ఘ విచారణల అనంతరం అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా కేసు జాప్యం చేస్తే రాజధాని ఇష్యూలో వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఇంతలో ఎన్నికలు వస్తాయి.. రాష్ట్రంలో అధికారం చేతులు మారితే తిరిగి అమరావతి రాజధానిగా నిలబడుతుందన్నది ప్రభుత్వ వ్యతిరేకవర్గాల భావన.

GLOBAL SUMMIT 2023

Must Read

spot_img