ఇప్పటికే పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాట్లు చేసిన స్థానిక పాలనా యంత్రాంగం తాజాగా మరో రెండు ప్రాంతాల్ని పర్యాటకుల కోసం సిద్ధం చేసింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత .. కాశ్మీర్ లో పర్యాటకం ఓ రేంజ్ లో సాగుతోంది. దీంతో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో
పర్యాటక రంగానికి స్థానిక పాలనా వ్యవస్థ పెద్ద పీట వేస్తోంది.
శీతాకాలంలో పర్యాటకులను ఆకర్షించడానికి జమ్మూ కశ్మీర్ టూరిజం శాఖ మరో రెండు కొత్త ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తెరువనుంది.
ఇదివరకే ఈ ఏడాది పలు కొత్త ప్రాంతాలను టూరిస్ట్ కేంద్రాలుగా ప్రవేశపెట్టగా ఇప్పుడు మరో రెండు ప్రాంతాలను కూడా తెరవాలని చూస్తోంది.
జమ్మూ కశ్మీర్ టూరిజం శాఖ పర్యాటకులను ఆకర్షించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్, గుల్‌మార్గ్ స్కీయింగ్ ప్రదేశాలతో పాటు
అదే కోవకు చెందిన మరో రెండు కీలక ప్రాంతాలను కూడా ఇకపై పర్యాటకుల కోసం తెరిచి ఉంచాలని భావిస్తోంది. సహజంగానే శీతాకాలంలో జమ్మూ
కశ్మీర్‌ను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే, కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లు అక్కడ కూడా ఈ రంగం పూర్తిగా
దెబ్బతింది. ఈ ఏడాది ప్రయాణ ఆంక్షలు లేకపోవడంతో రికార్డు స్థాయిలో పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
మునుపెన్నడూ లేని విధంగా మొదటి 9 నెలల్లోనే 1.62 కోట్ల మంది జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. కాగా, శీతాకాలంలో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మంచు అధికంగా కురిసే ప్రదేశాలను అధికారులు మూసివేస్తారు. అయితే, టూరిస్టులను ఆకర్షించడానికి ఈ ఏడాది కొన్ని ప్రాంతాలకు మినహాయింపునిచ్చి సందర్శకులను ఆకర్షించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కీలక ప్రాంతాలను కూడా అధికారులు తెరవాలని భావిస్తున్నారు. దీంతో జమ్మూ కశ్మీర్‌ను మరింత మంది సందర్శిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కాశ్మీర్ లోయకు వచ్చే
పర్యాటకులను ఆకర్షించడానికి ఈ నెలలో రెండు, మూడు రోడ్‌షోలతో పాటు ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌ను కూడా ముందుకు తీసుకువెళ్లాలని
చూస్తున్నట్లు అధికారులు చెప్పారు.
పహల్గామ్, గుల్‌మార్గ్‌తో పాటు ఈ రెండు కొత్త గమ్యస్థానాల్లో ఈ శీతాకాలంలో వింటర్ కార్నివాల్, ఐస్ సిటీ,ఇతర సంబంధిత ఈవెంట్‌లను ప్లాన్
చేస్తున్నట్లు అధికారులు వివరించారు. దేశంలోని పర్యాటక ప్రాంతంలో ప్రముఖమైన జమ్మూ కశ్మీర్ లో పర్యటించేందుకు పర్యాటకులు రావాలని,
పర్యాటకుల కోసం ప్యాకేజీలను పునరుద్ధరించామని తెలిపారు. జమ్ము కాశ్మీర్ లో మార్పు మొదలైంది.
శాంతియుత జీవనానికి అలవాటు పడుతున్నారు. మతసామరస్యం వెల్లివిరుస్తోంది. జమ్ము కాశ్మీర్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ప్రజల్లో మంచి జీవనం కోసం ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దుతో ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసింది. దీంతో ప్రజల్లో ఐకమత్యం కనిపిస్తోంది. పర్యాటక
రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. సరస్సులు, నదులు, పర్వతాలు అన్ని ప్రజల సందడితో కళకళలాడుతున్నాయి. ఇప్పటివరకు 1.62 కోట్ల మంది
పర్యాటకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సుందర ప్రదేశాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతోంది.
అభివృద్ధి అమాంతం రెట్టింపవుతోంది. జమ్ము కాశ్మీర్ ఎంతో మంది పర్యాటకులకు స్వర్గధామంగా మారుతోంది. ఇంకా రాబోయే రోజుల్లో కాశ్మీర్ లో పర్యాటక రంగం ఇంకా పైకి పోయే సూచనలున్నాయి. అందమైన ప్రాంతం కావడంతో ఎంతో మంది కాశ్మీర్ ను సందర్శించేందుకు మొగ్గు చూపుతున్నారు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతోంది.
రికార్డు స్థాయిలో డబ్బు రావడంతో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్ము కాశ్మీర్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచించి మరీ సరస్సులను ఎంతో అందంగా తీర్చిదిద్దింది. వంతెనలు కట్టి ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా చేస్తున్నారు. దీంతో పర్యాటక రంగం ఎంతో ముందుకు పోతోంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి చాలా ఎక్కువగా ఉండడంతో భారతీయులు చల్లగా ఉండే ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్ కు
వెళ్లడానికి పర్యాటకులు మొగ్గు చూపుతూ ఉన్నారు.
దీంతో కశ్మీర్ పర్యాటక పరిశ్రమకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది. గత దశాబ్దంలోనే అత్యధికంగా పర్యాటకులు కశ్మీర్ కు వచ్చారు. 2022 మార్చి నెలలో కశ్మీర్ 1.8 లక్షల మంది పర్యాటకులను చూసింది. ఇతర చోట్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో, ఈ సీజన్‌లో ఎక్కువ మంది పర్యాటకులు కశ్మీర్‌కు వెళతారని భావిస్తున్నారు. రాష్ట్రంలో తులిప్ గార్డెన్, మొఘల్గా ర్డెన్స్ వంటి పర్యాటక ఆకర్షణల గురించి చేసిన ప్రచారం కూడా పర్యాటకుల సంఖ్య పెరగడానికి కారణం అయింది.
మెజారిటీ హోటల్‌లు, హౌస్‌బోట్‌లు తమ బుకింగ్‌లకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లు ఇప్పటికే అయ్యాయని, అందువల్ల రాబోయే నెలల్లో మంచి పర్యాటక సీజన్కొ నసాగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత కశ్మీర్‌లో ఇది మొదటి పూర్తి టూరిస్ట్ సీజన్.
2019 ఆగష్టు 5 న రాజ్యసభలో జమ్మూ కశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం శాఖామంత్రి అమిత్ షా
ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పై సర్వాధికారాలూ కేంద్ర
ప్రభుత్వానికే వచ్చాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి వచ్చాయి.
ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలవుతుంది. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది. వెనువెంటనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జమ్మూ, కాశ్మీర్, లఢాఖ్ ప్రాంతాలలో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజల కనీస అవసరాలు తీర్చడం, ఉపాధి కల్పన ద్వారా వారి స్థితి గతులలో మార్పు తీసుకొచ్చి, వేర్పాటువాదుల కబంద హస్తాల నుంచి వారిని విముక్తం చెయ్యాలనేది కేంద్రం వ్యూహం…
దేశం కంటే 25 ఏళ్ళు వెనుకబడిపోయిన జమ్మూ, లఢాఖ్, కాశ్మీర్ ప్రజలను మిగతా దేశ ప్రజలతో సమానంగా అభివృద్ధి పరచాలి. మిగతా దేశానికి కాశ్మీర్ ని, కాశ్మీరీలను చేరువ చెయ్యాలి. ఈ సమున్నత,సుదృఢ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను చక్కబెడుతూనే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచే దిశగా వడివడిగా అడుగులు వేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పోలీసులపైకి రాళ్లు విసిరే ఘటనలు, అల్లర్లు తగ్గాయి. దాంతో
2019వ సంవత్సరంలోనే 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలి ఆరు నెలల కాలంలో 34,10,219 మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ ను
సందర్శించారు.
వీరిలో 12,934 మంది విదేశీయులు. ఆరునెలల్లో జమ్మూ కాశ్మీర్ కు పర్యాటక రంగం ద్వారా రూ. 25.12కోట్ల ఆదాయం వచ్చింది.
ఆ తర్వాత 2020, 21 లలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందింది. నిజానికి 2015 లోనే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీరు అభివృద్ధికి 80,000
కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది.
ఈ ప్యాకేజీని ప్రకటించే సందర్భంలో ప్రధాని మోడీ .. కేవలం ఖజానానే కాదు, మా హృదయ స్పందన కూడా జమ్మూ కాశ్మీర్ కోసమే అన్నారంటేనే జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి శ్రీ మోడీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. గత రెండు సంవత్సరాలుగా, కేంద్రప్రభుత్వం జమ్మూ- కాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రైమ్ మినిస్టర్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ద్వారా ఎన్నో వినూత్న పథకాలను రూపొందించి అమలు చేస్తోంది.
కాశ్మీర్ అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం చేపడుతోన్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో పర్యాటక రంగం .. ఇంతింతై వటుడింతై అన్నట్లు అభివృద్ధి సాధిస్తోంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..