టీడీపీ టికెట్ విషయంలో మూడు ముక్కలాటగా సీన్ మారింది. ప్రస్తుతం ఉన్న వ్యక్తి కాదని.. మరో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో బాబు .. ఇప్పటికే వారి బయోడేటాతో సహా అన్ని ఈక్వేషన్స్ స్క్రూటినీ చేస్తున్నారట.ఇంతకీ కొత్తగా తెరపైకి వచ్చిన ఆ పాత నేతలు ఎవరు..?
గుంతకల్లు… అనంతపురం జిల్లా కర్నూలు సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కూల్ పాలిటిక్స్ ఉంటాయి. అనంతపురం జిల్లా లాంటి క్లిష్టమైన ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే ప్రాంతం గుంతకల్లు. ఇక్కడి నేతలు కూడా ఎన్నికల సమయంలోనే వాటి గురించి ఆలోచిస్తారు. మిగిలిన సమయంలో ఎవరి పని వారిదే.
అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఏడాదిన్నర ముందే పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్కా కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో టీడీపీ ఒక అడుగు ముందుందని చెప్పాలి. ప్రత్యేకించి గుంతకల్లు విషయంలో గట్టిగా గురి పెట్టింది. ఎందుకంటే గుంతకల్లులో బీసీలు ఎక్కువ.. టీడీపీకి బలమైన ప్రాంతం. గత ఎన్నికల్లో ఇక్కడ ఓటమి పాలుకావడం పై పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అత్యధిక ఓట్లతో టీడీపీ ఓటమి చెందిన స్థానాల్లో గుంతకల్లు నాలుగో స్థానంలో ఉంది. అందుకే ఈసారి ఖచ్చితంగా గెలిచే అభ్యర్థినే బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలెవరనేది ప్రధానంగా పరిశీలిస్తే మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రస్తుత నియోజకవర్గ ఇన్ ఛార్జి జితేంద్ర గౌడ్, పీజేఆర్ ట్రస్టు చైర్మన్ జీవానందరెడ్డి, వెంకట శివుడు యాదవ్ పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడొక చర్చ స్థానికంగా గట్టిగానే వినిపిస్తోందట.
నియోజకవర్గంలో కీలకంగా మారిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ను
కాదని ఇంకొకరి వైపు పార్టీ ఎందుకు చూస్తోందన్నదే చర్చనీయాంశంగా మారుతోంది.
అయితే దీనికి బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జితేంద్ర గౌడ్ చాలా సౌమ్యుడు. మొదటి నుంచి ఆయన కుటుంబం రాజకీయాల్లోనే ఉంది. ఆయన తండ్రి ఎమ్మెల్యేగా చేశారు.. సోదరుడు సాయినాథ్ గౌడ్ ఎమ్మెల్యేగా పని చేశారు. జితేంద్ర గౌడ్ కూడా 2014ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేశారు. ఇంకో సోదరుడు మున్సిపల్ ఛైర్మన్ గా చేశారు. ఇంత బలమైన రాజకీయ నేపథ్యం ఉండటంతో నియోజకవర్గంలో
మంచి గ్రిప్ ఉంది. కానీ అధికార పార్టీకి ధీటుగా కార్యక్రమాలు చేయడం లేదన్న విమర్శ ఉంది. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వాయిస్ వినిపించినప్పుడల్లా లేదా ప్రజా వ్యతిరేక చర్యల మీద అస్సలు పోరాటం చేయలేదని సొంత పార్టీ నేతలే అధిష్టానం వరకు తీసుకెళ్లారు.
వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకం కానున్న నేపథ్యంలో ఈ సారి ఇలాంటి మెతక వైఖరి ఉంటే వైసీపీని ఢీకొట్టలేమన్న భావనలో ఉంది. అందుకే కొత్తగా ఎవరైతే బాగుంటారన్న చర్చ నేపథ్యంలోనే ఇంకో రెండు పేర్లు బలంగా తైర పైకి వచ్చాయి. ఇందులో పామిడి ప్రాంతానికి చెందిన జీవానందరెడ్డి, వెంకట శివుడు యాదవ్. ఈ రెండు పేర్లను అధిష్టానం చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈసారి క్యాష్ట్ ఈక్వేషన్స్ చాలా బలంగా పని చేసే అవకాశం ఉంటుంది.
ఇలా ఆలోచిస్తే ఇద్దరికీ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ముందుగా వెంకటశివుడు యాదవ్ విషయానికొస్తే.. ఆయన గుత్తి మండలంలో చాలా బలమైన నేత. గుంతకల్లు నియోజకవర్గానికి గుత్తి ప్రాంతం హార్ట్ లాంటిది. అంతే కాదు.. బండారు ఆనంద్, కేసీ హరి లాంటి సీనియర్ నాయకులు వెంకటశివుడికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి గుంతకల్లులో బీసీలు అత్యధిక జనాభా ఉంది.
జితేంద్ర గౌడ్ ను కాదని ఆలోచిస్తే మరో బీసీకి ఇవ్వాలి అంటే, బీసీల్లో అంతటి పేరున్న వ్యక్తి వెంకట శివుడు యాదవ్ మాత్రమే. టీడీపీ అందునా ఆయన గత
రెండు ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎలాగైనా టికెట్ సాధించాలని కసి మీద ఉన్నారు. గతంలో రెండుసార్లు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో అధిష్టానం కూడా వెంకట శివుడు వైపు చూస్తోంది. అందునా మాజీ మంత్రి, పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్న యనమల రామకృష్ణుడు బలమైన సపోర్ట్ వెంకట శివుడికి ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వమని యనమల వైపు నుంచి కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
ఇక మూడో అతి ముఖ్యమైన వ్యక్తి.. జీవానందరెడ్డి. జిల్లాలో ఈ మధ్య కాలంలో పొలిటికల్ సర్కిల్స్ లో అతి ఎక్కువగా వినిపిస్తున్న పేరు జీవానందరెడ్డి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో జనంలోకి విస్తృతంగా వెళ్తున్నారు. గతంలో రాజకీయాలకు దూరంగా సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరయ్యారు. ఉచిత వివాహాలు, నిత్యాన్నదానం, అలాగే మహిళల స్వయం ఉపాధి కోసం శిక్షణ, ఆర్థిక సాయం, ఇక అడిగిన వారికి ఎలాంటి సాయమైనా చేస్తూ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు బలంగా వినిపిస్తున్న పేరు. అయితే గత రెండు వారాల క్రితం ఈయన నడుపుతున్న టైలరింగ్ శిక్షణా కేంద్రంలో
అగ్నిప్రమాదంతో ఈయన పేరు చంద్రబాబు వరకు వినిపించింది.
అయితే అది ప్రమాదం కాదని.. వైసీపీ నేతలే చేశారని ఆరోపించడంతో ఆయన ఎవరన్నది అందరికీ తెలిసింది. అంతే కాకుండా ఆయనకు నియోజకవర్గంలో ప్రజా బలం ఉందని, వైసీపీని నేరుగా టార్గెట్ చేసే నేతగా పేరు తెచ్చుకున్నారు. దీంతో పాటు చంద్రబాబు, లోకేష్ లను కలవడంతో ఆయన టికెట్ రేసులో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన రెడ్డి సామాజిక వర్గం కావడం మైనస్ కొందరంటుంటే కాదు అదే అతని బలం అని మరికొందరంటున్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి ధీటుగా ఉండాలంటే జీవానందరెడ్డే సరైన వ్యక్తి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యేను సొంత పార్టీకి చెందిన రెడ్లు వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం ఉంది. దీంతో వారందర్నీ జీవానందరెడ్డి క్యాష్ట్ ఈక్వేషన్స్ లో కలుపుకుంటే విజయానికి అడ్డే ఉండదని చెప్పుకుంటున్నారు.
క్యాష్ట్ ఈక్వేషన్స్ లో చూసినా.. బలా బలాలు చూసిన గుంతకల్లు టీడీపీలో ఈ రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి….!!
ఇప్పటికే అధిష్టానం కూడా ఇద్దరి పై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో టిక్కెట్ రేసులో ముందున్న జింతేద్ర
గౌడ్ తన పట్టు నిరూపించుకుంటారో లేదోనన్నదీ చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయన్ని కాదని .. వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా, సెగ్మెంట్ లో వర్గపోరు తప్పకపోవచ్చన్న అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో .. వీరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న విషయంలో అధిష్టానం తర్జనభర్జనలు పడుతోందన్న టాక్వె ల్లువెత్తుతోంది. మరోవైపు .. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై వీరెంతమేర ప్రభావం చూపించగలరన్న వాదన కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. దీంతో క్యాస్ట్ఈ క్వేషన్స్ తో పాటు స్థానిక రాజకీయాంశాలు కూడా కీలకంగా మారాయి. సెగ్మెంట్లో నెలకొన్న పరిస్థితులు సైతం .. అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అత్యవసరంగా మారడంతో, సెగ్మెంట్లో అభ్యర్థి ఖరారు సైతం హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు
ఆశావహులు సైతం టిక్కెట్ రేసులో బలంగా ఉండడమే కాకుండా పట్టు బిగిస్తుండడంతో, ఎవరికి ఇస్తే, ఏ తలనెప్పి తలెత్తనుందోనన్న చర్చ అధిష్టాన పెద్దల్లో తర్జనభర్జనలకు కారణమవుతోంది. ఈ సెగ్మెంట్లో గెలుపు గుర్రం ఎవరన్నదే స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరి ఈ టికెట్ రేసులో గెలిచి.. నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసే లీడర్ ఎవరో చూడాలి…