Homeఅంతర్జాతీయంఉక్రెయిన్​ కు ఈ యుద్ద ట్యాంక్ అంత కీలకం కానుందా..?

ఉక్రెయిన్​ కు ఈ యుద్ద ట్యాంక్ అంత కీలకం కానుందా..?

లెఫ్టర్ -2 కొద్ది రోజులుగా ఐరోపాలో మారుమోగుతున్న పేరు ఇది.. గత 11 నెలలుగా దాడులకు తెగబడుతోన్న రష్యాను ఎదుర్కోవడానికి ఈ యుద్ద ట్యాంక్ అవసరమని ఉక్రెయిన్ గట్టిగా ప్రయత్నిస్తోంది.. దీని తయారీదారైన జర్మనీ ఈ ఆయుధాలు త్వరలో ఉక్రెయిన్ కు అందిస్తోంది.. లెపర్డ్ అంటే చిరుత అని అర్ధం.. పేరుకు తగ్గట్టే ఈ అధునాతన ప్రధాన యుద్ద ట్యాంక్ చాలా చురుగ్గా ఉంటుంది..

ప్రపంచంలోనే మేటి ఆయుధాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.. జర్మనీకి చెందిన క్రాస్ మఫాయ్ వేగ్ మన్ సంస్థ దీన్ని అభివ్రుద్ది చేసింది.. లెపర్డ్ -1 పేరుతో తొలిసారిగా 1979లో వినియోగంలోకి వచ్చింది.. ఆ తర్వాత అనేక ఆధునిక వేరియంట్లు వచ్చాయి.. ప్రస్తుత లెపర్డ్ -2 కాల్పుల సామర్ధ్యం అమోఘం.. వేగం, చురుగ్గా ఎటువైపైనా కదిలే నైపుణ్యం దీని సొంతం.. ఇందులో ఆయుధ వ్యవస్థలకు పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది.. ఈ ప్రత్యేకతల ద్రుష్ట్యా ఇది అనేక రకాల యుద్ద క్షేత్రాలకు అనువుగా ఉంటుంది..

ప్రస్తుత యుద్దంపై లెపర్డ్ -2 ట్యాంకులు ఏదైనా ప్రభావం చూపాలంటే కనీసం 100 ట్యాంకులు అవసరమని నిపుణులు చెబుతున్నారు.. అయితే.. 300 ట్యాంకులు కావాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి కోరుతున్నారు.. 11 నెలల యుద్దంలో చాలా వరకు ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్.. క్రమంగా రష్యాపై ఎదురుదాడికి దిగాలనుకుంటోంది.. ఈ మేరకు కొంతకాలంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది.. రష్యా చేజిక్కించుకున్న తన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన యుద్ద ట్యాంకులతో భారీగా దాడికి దిగాలను భావిస్తోంది..

ఇందుకు లెపర్డ్ -2 బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది..ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం 1970 లనాటి టీ -72 ట్యాంకులు ఉన్నాయి.. వాటిలో సుదూర లక్ష్యాలను గుర్తించి, అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడంలో సాయపడే ఫైర్ కంట్రోల్ వ్యవస్థ లేదు.. పైగా ఈ ట్యాంకుల్లో మందుగుండును ప్రధాన ట్యాంక్ కంపార్ట్ మెంట్ లో నిల్వ చేయాలి.. శత్రుదాడికి గురైనప్పుడు ఇవి పేలిపోయి.. సొంత బలగాలకు పెను నష్టాన్ని కలిగిస్తున్నాయి.. లెపర్డ్ -2 పాటు పశ్చిమ దేశాలకు చెందిన ట్యాంకుల్లో ఈ మందుగుండును భద్రపరచుకోవడానికి ప్రత్యేక రక్షిత కంపార్ట్ మెంట్లు ఉన్నాయి..

లెపర్డ్ -2 పశ్చిమ దేశాలకు చెందిన ఇతర ఆధునిక ట్యాంకులు, రష్యా వద్ద ఉన్న టి – యుద్ద ట్యాంకుల కన్నా చాలా మెరుగైనవి.. లెపర్డ్ -2 లో నాటో ప్రామాణీకరించిన 120 ఎంఎం మందుగుండు ఉపయోగిస్తారు.. వీటి సరఫరాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.. అందువల్ల ఉక్రెయిన్ వాటిని భారీగా సమకూర్చుకోవచ్చు.. ప్రస్తుతం ఆ దేశ ట్యాంకులు 125 ఎంఎం మందుగుండును ప్రయోగించగలవు.. అమెరికా వద్ద మరింత శక్తివంతమైన ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు ఉన్నాయి..

వీటిని ఉక్రెయిన్ కు సరఫరా చేయడానికి అగ్రరాజ్యం నిరాకరించింది.. సంక్షిష్టమైన ఈ ఆయుధాల నిర్వహణ చాలా కష్టమని, ఇవి ఉక్రెయిన్ కు అక్కరకురావని చెబుతోంది.. వీటికి బదులు 100 స్రైకర్ సాయుధ శకటాలు, 50 బ్రాడ్లీ యుద్ద వాహనాలను సరఫరా చేసే అవకాశం ఉంది.. అగ్రరాజ్యం తన మనసు మార్చుకుని అబ్రామ్స్ ట్యాంక్లను ఉక్రెయిన్ కు అందిస్తే.. జర్మనీ కూడా లెపర్డ్ -2 లను నేరగా సరఫరా చేయవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి..

లెపర్డ్ -2 ట్యాంకులు డీజిల్ తో నడుస్తాయి.. ఎం1 అబ్రామ్స్ కు జెట్ ఇంధనం అవసరం.. అందువల్ల అమెరికా ట్యాంకులతో పోలిస్తే జర్మన్ ట్యాంకుల నిర్వహణ ఉక్రెయిన్ కు సులువని నిపుణులు వాదిస్తున్నారు.. ఉక్రెయిన్ కు 14 ఛాలెంజర్ -2 ట్యాంకులను సరఫరా చేస్తామని బ్రిటన్ ఇటీవల హామీ ఇచ్చింది.. ఇవి కూడా శక్తివంతమైనవే.. అయితే.. బ్రిటన్ వద్ద 227 ఛాలెంజర్ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి.. అందువల్ల ఇప్పటికి ఇప్పుడు పెద్ద సంఖ్యలో వాటిని సరఫరా చేయడం సాధ్యం కాదు..

చెక్ రిపబ్లిక్ పోలండ్, సోవియేట్ హయాం నాటి టి -72 ట్యాంకులను ఉక్రెయిన్ కు సరఫరా చేశాయి.. తన లీక్లర్క్ ట్యాంకులను అందించే అంశాన్ని ఫ్రాన్స్ పరిశీలిస్తోంది.. ఒకవేళ మిత్రదేశాలు లెపర్డ్ -2 సరఫరా చేసినా.. వాటిని ఆగమేఘాల మీద వినియోగంలోకి తీసుకురావడం ఉక్రెయిన్ కు సాధ్యం కాదు.. ఈ
ట్యాంక్ పై కనీస స్థాయి పట్టు సాధించడానికి సైనిక,నిర్వహణ సిబ్బందికి 3-6 వారాల శిక్షణ అవసరం ఉంటుంది.. ట్యాంక్లను గరిష్థస్థాయిలోవినియోగించుకోలేకపోయినా.. స్వల్ప కాలంలో 80 శాతం సామర్ధ్యాన్ని ఉపయోగించుకున్నా చాలని ఉక్రెయిన్ భావిస్తోంది..

ఆధునిక యుద్ద ట్యాంక్ లను మోహరించి.. యుద్దంలో గెలిచేస్తామని భావించరాదని నిపుణులు చెబుతున్నారు.. వాటిని సరైన విధానంలో ఉపయోగించుకోవాలంటున్నారు.. వీటికి తోడు సాయుధ శకటాలు కావాలి.. ఉక్రెయిన్ ట్యాంక్ లకు రష్యా యుద్ద విమానాలు, హెలికాప్టర్ల నుంచి ముప్పు ఉంది.. వాటిని ఎదుర్కోవడానికి విమాన విధ్వంసక, నిఘా వ్యవస్థల అవసరం ఉంది.. కొత్త ట్యాంక్ లను పదాతి, శతఘ్ని దళాలు, ఇతర విభాగాలతో సమన్వయ పరచుకోవాలి.. పశ్చిమ దేశాల యుద్ద ట్యాంక్ లు మెరుగైనవే.. అయినప్పటికీ.. వాటిని సరఫరా చేస్తున్న దేశాలు నష్టాలకు సిద్దం కావాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.. యుద్దంలో వాటిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు..

Must Read

spot_img