Homeసినిమాఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ !!!

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ !!!

రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమలో రామ్ డైలాగ్స్ , సాంగ్స్ అన్నీ కూడా ఆడియన్స్‌ను షేక్ చేశాయి. తాజాగా ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ పనిలో పడ్డాడు పూరి జగన్నాథ్. లైగర్ ఫెయిల్యూర్‌తో జనగణమణ సినిమాను కాస్త పక్కన పెట్టి… ఇస్మార్ట్ శంకర్ 2 కు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు పూరి.

దర్శకుడు పూరి జగన్నాధ్ ని ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకు కారణం ‘లైగర్ ప్లాప్ అవ్వటం, ఆ తరువాత ఆ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్ ని కొంత డబ్బు తిరిగి ఇవ్వాలి అని అడగటం పెద్ద చర్చకే దారి తీసింది. అవన్నీ జరిగిన కొన్ని రోజుల తరువాత పూరి జగన్ ముంబై నుండి హైదరాబాద్ రాలేదు. ముంబై లోనే పూర్తిగా సెటిల్ అయ్యాడని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడు…? ఏ హీరో అయిన ఛాన్స్ ఇచ్చారా..? అన్నది టాలీవుడ్ లో చర్చగా మారింది.

‘లైగర్’ డిజాస్టర్ అవటం, పూరి జగన్ కి పెద్ద దెబ్బె తగిలింది. అతనితో సినిమా చేస్తాను అని చెప్పిన చిరంజీవి , ఆ సినిమా ఎప్పుడు ఎలా అనేది మాత్రం క్లారిటీ లేదు ఇంతవరకు. అప్పట్లో ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రచారం చేస్తున్నప్పుడు పూరి జగన్ , చిరంజీవి తో సినిమా చెయ్యడానికి ఉత్సుకతచూపించినప్పటికీ, ఆ ప్రచారాలు అయిపోయాక ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అది ఇప్పట్లో జరిగేది కూడా కాదు అని అంటున్నారు.

అయితే పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి ఒక సీక్వెల్ తీయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి టైటిల్ కూడా ‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ అని పెట్టాలని, దాని కోసమని పూరి.. రామ్ పోతినేని సంప్రదించగా అతను దీనికి ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రామ్ పోతినేని, పూరి జగన్ కి చాలా పెద్ద విజయం అందించింది. ఆ విశ్వాసం తోటే రామ్ మళ్ళీ పూరి జగన్ ని నిలబెట్టడానికి ఆ సినిమా సీక్వెల్ లో చెయ్యడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

Must Read

spot_img