HomePoliticsఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కొడాలి నాని .. మళ్లీ ఎన్టీఆర్ గళం ఎందుకు ఎత్తుకుంటున్నారన్న...

ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కొడాలి నాని .. మళ్లీ ఎన్టీఆర్ గళం ఎందుకు ఎత్తుకుంటున్నారన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!

వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ప్రత్యర్థిగా నందమూరి వారసుడు దిగుతున్నాడన్న టాక్ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఫ్యూచర్ కోసం కూడా అని పలువురు అంటున్నారట. ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ అంటేనే అంత ఎత్తున మండి పడే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. లోకేశ్ కు అడ్డు వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.

లోకేశ్ ను ప్రజలపై రుద్ది, ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్న కొడాలి నాని .. జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని , వల్లభనేని వంశీ మత్రులు అయినట్లేనని వెల్లడించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఉండేంత దమ్ము ధైర్యం కేవలం జగన్ కు మాత్రమే ఉందని, అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు డీఎన్ఏ

బీసీలు. ఎన్టీఆర్ పిల్లలను అనాథలను చేశారు. చెట్టుకొకరిని, పుట్టకొకరిని చేశారు. గాలికి వదిలేశారు. లోకేశ్ రాజకీయాలకు అడ్డం వస్తాడేమో అని, ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఎన్టీఆర్ డీఎన్ఏగా ఉన్న బీసీలంతా ఎన్టీఆర్ తో పాటు నడుస్తారని, ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేశారు. పప్పు సుద్ద లాంటి సన్నాసి, మాట్లాడటం కూడా చేతకాని మాలోకం లోకేశ్ ను తీసుకొచ్చి బీసీలపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే, రానున్న ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి అధికారంలోకి రావటం చంద్రబాబు లక్ష్యం. అదే సమయంలో కొడాలి నాని పైన గన్నవరం లో గెలుపొందటం పార్టీకి అంతే ప్రతిష్ఠాత్మకం. దీని కోసం గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అక్కడ నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు నష్టం చేసేదిగా గుర్తించారు. ఫలితంగా అందరికీ ఆమోద యోగ్యమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని నిర్ణయించారు. దీంతో, కొత్తగా నందమూరి వారసుడిని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలోకి దించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించటం ఈ సారి టీడీపీ ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి. ఇందు కోసం గుడివాడ కేంద్రంగా కొత్త నిర్ణయాలకు పార్టీ అధినేత చంద్రబాబు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పలువురి అభ్యర్ధుల పేర్లు కొడాలి నాని మీద పోటీ చేస్తారంటూ ప్రచారంలోకి వచ్చాయి. టీడీపీ వారి పైన ఫీడ్ బ్యాక్ తీసుకొనే క్రమంలోనే ఈ పేర్లు తెర మీదకు వచ్చినట్లు మరో వాదన. అయితే, కొడాలి నాని పైన పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరిని దించినా, ఫలితం ఎలా ఉంటుందనే అంశంలో సందేహాలు నెలకొన్నాయి.

ఒక దశలో మాజీ మంత్రి ఉమా పేరు తెర పైకి వచ్చింది. స్థానిక నేతలు ఎవరికి వారు తామే రానున్న ఎన్నికల్లో అభ్యర్ధులమని చెప్పకుంటున్నారు. కానీ, పార్టీ అధినేత ఆలోచన మాత్రం మరోలా ఉంది. గుడివాడలో ఉన్న సామాజిక సమీకరణాలు, పార్టీ బలంతో వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే వారిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొడాలి నాని పలు సందర్భాల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్.. నందమూరి కుటుంబం పైన తన అభిమానం చాటుకున్నారు.

అదే సమయంలో చంద్రబాబు – లోకేశ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తినే టీడీపీ నుంచి
గుడివాడ బరిలో దించాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కొడాలి నాని మద్దతు దారులుగా ఉన్న వారు సైతం టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ గుడివాడలో తనను ఓడించేందుకు భారీ మొత్తం ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా నాని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తుండటం.. లోకేశ్ మంగళగిరి ఖరారు కావటంతో, నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడిని ఎన్టీఆర్సొం త నియోజకవర్గం గుడివాడ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నందమూరి కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా నందమూరి చైతన్య కృష్ణ బరిలో దిగటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ. కొద్ది నెలల క్రితం చంద్రబాబు తన సతీమణి పైన వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

వైసీపీ నేతలే లక్ష్యంగా నందమూరి చైతన్య కృష్ణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు…!

వల్లభేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబుకు హెచ్చరికలు చేసారు. తాజాగా సినీ రంగంలో ప్రవేశించిన చైతన్య కృష్ణ కు బాబాయ్ బాలయ్య పూర్తి మద్దతు ప్రకటించారు. బసవతారకం క్రియేషన్స్ పతాకంపై చైతన్య కృష్ణ సినిమా నిర్మాణం జరుగుతోంది. దీంతో, నందమూరి వారసుడే గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే పార్టీ శ్రేణులంతా అక్కడ కొడాలి నానికి వ్యతిరేకంగా కలిసి కట్టుగా పని చేస్తాయని టీడీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. దీంతో, గుడివాడలో 2024 ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే ఉత్కంఠగా మారుతోంది.

ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ జూనియర్ ఎన్టీయార్ జపం చేస్తున్నారు. ఎన్టీయార్ వారసత్వాన్ని అడ్డుకోవాలని, జూనియర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని అంటున్నారు. చాలా రోజుల తర్వాత నోరు విప్పిన కొడాలి ఇప్పుడు జూనియర్ ను ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నా, ఆయనకున్న అనివార్యతలు అలాంటివని బాగా తెలిసిన వాళ్లు చెబుతున్నారు.

నిజానికి కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్. మనసులో పడిన మాట బయట పెడతారు. మాట దాచుకునే రకం కాదు. పైగా ఏదో విధంగా
చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని తిడతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీయార్ ప్రస్తావన తెస్తూ సీనియర్ వారసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జూనియర్కు , కొడాలికి మంచి స్నేహం ఉండేది. ఒక దశలో కొడాలికి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే జూనియర్ రికమండ్ చేశారని కూడా వార్తలు వచ్చా.యి. అప్పట్లో జూనియర్, టీడీపీకి ప్రచారం చేసేవారు. తర్వాతి కాలంలో కొడాలి వైపీసీలో చేరిపోయారు.

జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పైగా కొడాలి వైసీపీలో చేరిన తర్వాత జూనియర్ తోనూ
ఆయన సంబంధాలు తెగిపోయాయా
..?

ప్రస్తుతానికి జూనియర్ కు దూరంగా ఉన్నామని ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కొడాలి ప్రకటించారు. ఇప్పుడు మాత్రం మళ్లీ ఆయన పేరు తెచ్చారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారానికి రావాలంటే పగ్గాలు జూనియర్ కు అప్పగించాలని కొడాలి ఒకటి రెండు సార్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా
దాదాపు అలాంటి సందేశమే ఇస్తున్నారు. ఇందులో కొడాలి కూడా ఏదో ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీయార్ ను మళ్లీ మంచి చేసుకుంటే భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని ఆయన ఆశిస్తున్నారన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. సామాజిక వర్గం లెక్కలు కూడా ఉన్నాయి కదా.. పైగా వైసీపీకి వస్తున్న వ్యతిరేకతతో ఆ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో కొనసాగుతుందో తెలీదు కదా అని చర్చలు సాగుతున్నాయి.

మరి కొడాలి వ్యూహం ఏమేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img