Homeసినిమాఅర్జున్ రెడ్డి డైరెక్టర్ ద్వితీయ చిత్రం "యానిమల్‌"

అర్జున్ రెడ్డి డైరెక్టర్ ద్వితీయ చిత్రం “యానిమల్‌”

అర్జున్‌రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘కబీర్‌సింగ్‌’ పేరుతో బాలీవుడ్‌లో పునర్నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొంది. తొలి చిత్రంతోనే తెలుగు, హిందీ చిత్రసీమల్లో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ద్వితీయ చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు…మరిన్ని అప్టేట్స్ ఇచ్చారు మేకర్స్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక మళ్లీ అదే కథను హిందీలో కబీర్ సింగ్ గా తెరపైకి తీసుకువచ్చి బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని అందుకున్నాడు. అయితే మళ్లీ ఆ తర్వాత అతను మహేష్ బాబు తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సెట్ కాకపోవడంతో మళ్లీ అతను బాలీవుడ్ హీరో తోనే సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు.

ఇక మొత్తానికి ఎనిమల్ అనే సినిమాతో రణబీర్ కపూర్ ను ఈ దర్శకుడు సరి కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ హీరో డిఫరెంట్ కిల్లర్ గా సినిమాలో కనిపించబోతున్నట్లు ఇటీవల లీక్ అయిన కొన్ని ఫోటోలతోనే అర్థమైంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ వైల్డ్ ఫోటోను కూడా విడుదల చేశారు. అందులో గొడ్డలి పట్టుకుని మరో వైపై సిగరెట్ కాలుస్తూ ఉన్న రణబీర్ కపూర్ ఒంటినిండా గాయాలతో రక్తంతో భయంకరంగా కనిపిస్తున్నాడు.

చూస్తూ ఉంటే సినిమాలో అతను విలన్స్ ను ఊచకోత కోసినట్లుగా అనిపిస్తోంది. దర్శకుడు సందీప్ ఈ సినిమాను డిఫరెంట్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో…దర్శకుడు మొత్తానికి అఫీషియల్ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అనిమల్ సినిమాను 2023 ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాను కేవలం హిందీలోనే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ గా తెలుగు, తమిళ్, మలయాళం ,కన్నడ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.

Must Read

spot_img