Homeఅంతర్జాతీయంఅమెరికా వర్సెస్ రష్యాలుగా మారబోతుందా..?

అమెరికా వర్సెస్ రష్యాలుగా మారబోతుందా..?

ఉక్రెయిన్ కు అమెరికా నుంచి సహాయం అందకుండా చేసే వ్యూహంలో భాగంగానే రష్యా వార్నింగ్ ఇచ్చిందా..? లేక రష్యా.. అమెరికాతో ప్రత్యక్ష యుద్దానికి సిద్దమవుతోందని సంకేతాలు ఇస్తోందా..? ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దం రష్యా, అమెరికాల మధ్య యుద్దంగా మారనుందా..?

ఉక్రెయిన్, రష్యాల యుద్దం ప్రత్యక్షంగా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దమే.. కానీ.. దీని ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడింది..ముఖ్యంగా అమెరికా సహా నాటో దేశాల పాత్ర కీలకం.. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు యుద్దానికి దిగింది రష్యా.. అయితే.. రష్యా అనుకున్న విధంగా ఉక్రెయిన్ పై విజయం సాధించలేకపోయింది. ఉక్రెయిన్ తో గత ఏడాదిగా పోరాడుతూనే ఉంది..అయినప్పటికీ.. ఉక్రెయిన్ పై విజయం సాధించలేకపోతోంది.. అందుకు కారణం అమెరికా సహా నాటో దేశాలే.. ఉక్రెయిన్ యుద్దం చేస్తున్నప్పటి నుంచి అండగా ఉండటమే కాదు..

ఆర్ధిక, యుద్ద సామాగ్రి సైతం సహాయం చేస్తున్నాయి.. దీంతో ఉక్రెయిన్, రష్యాల యుద్దం కాస్తా.. పరోక్షంగా నాటో వర్సస్ రష్యాల యుద్దంగా మారింది.. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వార్నింగ్ ఇచ్చింది రష్యా.. తమ దేశంపై ఆంక్షలు పెట్టించడమే కాకుండా.. తమపైకి వచ్చే వాళ్లకు సహకరిస్తావని.. ఉక్రెయిన్ కు తెర వెనకే కాదు.. ముందే నిలబడతావ్.. అయితే.. మా దేశానితో డైరెక్ట్ గానే యుద్దం చేయొచ్చు కదా .. ఎందుకు ఈ చాటుమాటు యుద్దం.. దమ్ముంటే ముందుకు వచ్చి పోరాడు అని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది రష్యా..

అమెరికా.. మొత్తం హైబ్రిడ్ యుద్ధాన్ని ప్రేరేపిస్తూనే, రష్యా కు చెందిన మాస్కో పై అణ్వాయుధ దేశాలను ప్రత్యక్ష యుద్దానికి ప్రేరేపిస్తుందని రష్యా విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.రష్యాలో అణు తనిఖీల కోసం, మాస్కో అణు దళాలపై వాషింగ్టన్ డిమాండ్‌లు దాడులకు స్పష్టంగా సహాయపడతాయని రష్యా పార్లమెంటరీ పేర్కొంది. అణు తనిఖీలను అడ్డుకోవడం, కొత్త ఒప్పందాన్నిఉల్లంఘించడం వంటి అమెరికా ఆరోపణలకు ప్రతిస్పందనగా రష్యా ఈ విధంగా ప్రత్యక్ష యుద్దపు హెచ్చరికను జారీ చేసింది.

అణ్వస్త్రాలను తగ్గించుకోవాలని ఒప్పందాలు నడుస్తూ ఉంటే.. ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో ఇద్దరి తరుపున ఒక బృందాన్ని పంపిద్దాం. మీరు మా దగ్గరికి పంపించండి, మేము మీ దగ్గరికి పంపిస్తామని రష్యాని అడిగింది అమెరికా… దానికి బదులుగా అమెరికాతో, యుద్ధం టైములో.. నీకెందుకు పంపిస్తాం, ఈ టైంలో నీకు పంపిస్తే నువ్వా స్థావరాలు తీసుకెళ్ళి ఉక్రెయిన్ కి చెప్పడానికా అని రష్యా అంటోంది.. ఒకవైపు.. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇస్తున్నావ్, మరోవైపు… యుద్ధ విమానాలను ఇస్తున్నావ్, ఉక్రెయిన్ కు ముందు వెనకాల కూడా సహాయం చేస్తున్నావ్, నీ మాటలు నేనెందుకు వినాలి అన్నట్టుగా రష్యా అంటోంది.. మా యుద్దం మధ్యలో ఇలాంటి వ్యవహారాలు నడిపితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవ్వాల్సి వస్తుందని అమెరికాను హెచ్చరించింది రష్యా..

ఉక్రెయిన్‌ పై యుద్ధం విషయంలో ఇప్పటికే పలుమార్లు అమెరికాను హెచ్చరించింది రష్యా… ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణుల సరఫరాను ప్రారంభిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గతంలోనే హెచ్చరించింది. అమెరికా అలా చేస్తే రష్యా ఇకపై కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపితే రష్యా ఇప్పటి వరకూ దాడి చేయని కొత్త లక్ష్యాలపై గురి పెట్టాల్సి వస్తుందని పుతిన్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చేశారు.

అయితే.. ఉక్రెయిన్, రష్యాల యుద్దం మొదలైన తర్వాతే.. అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు యూరప్ దేశాలు అన్నీ కలిసి రష్యాను ఒంటరిని చేసి కఠినమైన ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై ఈ దేశాలు 5 వేలకు పైగా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.గతాన్ని పరిశీలిస్తే ప్రపంచంలోని మరే ఇతర దేశంపై కూడా ఎన్నడూ ఇలాంటి ఆంక్షలు లేకపోవడం విస్తుపోయే విషయం.. అయినా కూడా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్రమక్రమంగా అమెరికా యూరప్ దేశాలకు, రష్యాకు మధ్య ఆర్థిక యుద్ధంగా మారుతున్నాయి.సోవియట్ యూనియన్ పతనం తరువాత, యునైటెడ్ స్టేట్స్, రష్యాలు ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.. జార్జ్ బుష్, బోరిస్ యెల్ట్సిన్ సంతకం చేసిన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు అనే ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి.

యునైటెడ్ స్టేట్స్, రష్యా జర్మనీలో సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, కౌంటర్ టెర్రరిస్ట్ విన్యాసాలు నిర్వహించాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే ఆశతో ఇది జరిగింది. అప్పటి రష్యా అధ్యక్షుడు కూడా యునైటెడ్ స్టేట్స్, రష్యా సంయుక్త క్షిపణి రక్షణ వ్యవస్థను అజర్‌బైజాన్‌లో ఉంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను యునైటెడ్ స్టేట్స్ పరిశీలించింది.. 2008లో, జార్జియాపై ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా , యునైటెడ్ స్టేట్స్ తన ఉమ్మడి NATO- రష్యా సైనిక వ్యాయామాలను రద్దు చేసింది.

నాటో దాని విధానాలలో యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రముఖ పాత్ర ద్వారా రష్యా- యూఎస్ సంబంధాలు గణనీయంగా ప్రభావితమయ్యాయి… నాటో, రష్యా 2002 రోమ్ సమ్మిట్‌లో భద్రతా సమస్యలపై సహకరించుకోవడానికి అంగీకరించాయి. క్రమంగా సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి… అయితే, కూటమి విస్తరణ , జార్జియాలో రష్యా జోక్యం , ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రచారం, ఇతర వివాదాల కారణంగా సంబంధాలు గణనీయంగా క్షీణించాయి.

మే 2015లో, NATOతో పెరిగిన ఉద్రిక్తతలను అనుసరించి, రష్యా ఒక కీలకమైన సైనిక రవాణా కారిడార్‌ను మూసివేసింది, ఇది రష్యన్ భూభాగం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు సైనిక సామాగ్రిని అందించడానికి NATOను అనుమతించింది. ఉగ్రవాదంపై అమెరికా చేస్తున్న యుద్ధానికి రష్యా మద్దతు తెలిపింది. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో సహాయం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌లోని యునైటెడ్ స్టేట్స్ దళాలకు లాజిస్టిక్ మద్దతును అందించడానికి రష్యా అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లేందుకు రష్యా తన భూభాగం గుండా అమెరికా, నాటో దళాలను అనుమతించింది.

అయితే.. ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి దిగడంతో.. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆర్ధిక, యుద్ద సామాగ్రి సహాయం అందించాయి.. అంతేకాదు.. రష్యాపై అనేక రకాల ఆంక్షలు విధించాయి..ప్రపంచదేశాలలో రష్యాను ఒంటరి చేయాలని ప్రయత్నించాయి.. అమెరికా, నాటో దేశాల ఆంక్షలు తలొగ్గని రష్యా.. ఉక్రెయిన్ పై యుద్దం చేస్తూనే వస్తోంది.. తాజాగా రష్యా చేసిన వ్యాఖ్యలు అమెరికాతో ప్రత్యక్షంగా యుద్దానికి దిగేందుకు సైతం వెనకాడమనే సంకేతాలు ఇచ్చినట్లయింది.. ఓ వైపు.. అత్యాధునిక యుద్ద విమానాలను ఇవ్వాలని ఉక్రెయిన్..

నాటో, అమెరికాలను కోరుతోంది.. అదే సమయంలో దమ్ముంటే తమ దేశంతో ప్రత్యక్షంగా యుద్దం చేయాలంటూ రష్యా హెచ్చరికలు చేయడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.. మరి.. చూడాలి.. అమెరికా, రష్యాల వివాదం చివరకు ఏ స్థాయికి చేరుతుందో.. రష్యాతో యుద్దం చేస్తోన్న ఉక్రెయిన్ కు అమెరికా, నాటో దేశాలు యుద్ద సామాగ్రి, ఆర్థిక సహాయం చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఉక్రెయిన్ కు అమెరికా సహా నాటో దేశాల సహాయంపై రష్యా మండిపడుతోంది.. తాజాగా అమెరికాకు సవాల్ విసురుతూ.. ఉక్రెయిన్ వెనక ఉండి కాదు.. ప్రత్యక్ష్యంగానే యుద్దం చేయాలంటూ హెచ్చరించడంతో ఈ పరిణామాలు ఎక్కడికి వెళతాయోనని ప్రపంచదేశాలలో ఆందోళన మొదలైంది..

Must Read

spot_img